Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pavan in nitin movie

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్య, క్రిష్‌ 'శాతకర్ణి' భళా

balakrishna act in  krish direction

కొన్ని సినిమాలు విడుదలకు ముందే విపరీతమైన హైప్‌ని క్రియేట్‌ చేస్తాయి. కొన్ని సినిమాలు ప్రారంభోత్సవానికి ముందే ఆలోచింపజేస్తాయి, ఆకట్టుకుంటాయి. పదహారణాళ అచ్చ తెలుగు సినిమాగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాని బాలకృష్ణ హీరోగా క్రిష్‌ తెరకెక్కించనున్నాడు. 'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుం', 'కంచె' వంటి విభిన్న చిత్రాలు తీసిన దర్శకుడు క్రిష్‌, 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే టైటిల్‌ దగ్గర్నుంచీ ప్రత్యేకతను చాటుకున్నాడు. టైటిల్‌తో కూడిన సినిమా పోస్టర్‌ అత్యద్భుతంగా ఉందని రెస్పాన్స్‌ వస్తోంది.

ఇది హీరోగా నందమూరి బాలకృష్ణకు వందవ సినిమా. టైటిల్‌ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కావడంతో, 'అంజనీ పుత్ర క్రిష్‌' అని టైటిల్స్‌లో తన పేరును వేసుకుంటున్న క్రిష్‌, సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలకృష్ణకీ, బసవతారక పుత్ర అని పేరు వేశాడు. టెక్నీషియన్లకీ ఇలానే చేస్తున్నాడు. ఇది తెలుగు సినీ రంగంలోనే అరుదైన ప్రయోగంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగింది ఈ చిత్రానికి. 100వ సినిమా అంటే ఈ రోజుల్లో ఏ కొత్త హీరోకైనా అసాధ్యమే. ఈ ఫీట్‌ సాధించేందుకు సిద్ధమవుతున్న నందమూరి బాలకృష్ణ, రొటీన్‌ కమర్షియల్‌ సినిమా కాకుండా ఆలోచింపజేసేలా, చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రం చేస్తుండడం నిజంగా అభినందనీయం. 

మరిన్ని సినిమా కబుర్లు
trish new innigs with nayaki