Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

29-04-2016 నుండి 05-05-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొనేవిషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. పెద్దలతో వివాదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. సమయానికి భోజనం చేయుట సూచన ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోండి. చేపట్టిన పనులలో పనిభారంతప్పక పోవచ్చును. గతంలో చేసిన పనులకు సంభందించి నలుగురిలో గుర్తింపును పొందుతారు. కుటుంబసభ్యుల నుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది వారితో నూతన చర్చలు చేయుటకు అవకాశం కలదు. సంతానపరమైన విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయల్లో మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇతరులతో మాట పడవలసి రావోచ్చును కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మిత్రుల నుండి సూచనలు వస్తాయి బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. 

 

 

వృషభ రాశి ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. పనుల్లో ఫలితాలు ముందే ఆశించక పోవడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవిగా ఉండే అవకాశం ఉంది. ఆప్తుల ఆరోగ్యం మిమ్మల్ని మరింత ఇబ్బందికి లోనుచేసే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. చిననాటి మిత్రులతో కలిసి ఆలోచనలు ఫలితాలను కలుగజేస్తాయి. ఉద్యోగంలో మాత్రం మిశ్రమఫలితాలు పొందుతారు కావున సర్దుబాటు అవసరం అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళే అలవాటు తప్పక మేలుచేస్తుంది. ప్రయాణాల మూలాన నష్టపోయే అవకాశం ఉంది కావున వాయిదా వేయుట ఉత్తమం.  

 

                       

మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో మిత్రులతో కలిసి చేపట్టిన ఆలోచనలు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయి. మీయొక్క మొహమాటం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది తలకు మించిన భారం మీపైన పడేవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు వాటికి సమయం ఇస్తారు. పెట్టుబడుల విషయంలో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. సోదరులతో చేసిన చర్చలు మిశ్రమఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో కొంత మీ ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం కలదు కాబట్టి నిదానంగా వ్యవహరించుట సూచన. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వారం చివరలో మాత్రం అనుకున్న పనులను పూర్తిచేయుట ద్వార ఊరట చెందుటకు ఆస్కారం కలదు.  
 

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో లబ్దిని పొందుతారు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రుల నుండి ఆశించిన సహకారం రావడం చేత తాల్పెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. బందువులలో మంచి పేరును సంపాదించుకొనే అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. దైవసంభందమైన పూజలలో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో బాగుంటుంది కాకపోతే అనారోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. కొన్ని కొన్ని విషయల్లో అసంతృప్తిని కలిగి ఉండే అవకాశం ఉంది సరైన కారణం ఉండకపోవచ్చును. పెద్దలతో కలిసి చేసిన ఆలోచనలు మంచి ఫలితాలనే ఇస్తాయి. 

           
సింహ రాశి : ఈవారం మొత్తంమీద  చేపట్టుపనుల విషయంలో సరైన అవగహన ఉండుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో చర్చలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో బాగుంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరసంభందమైన వర్గం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. సమయాన్ని ప్రయాణాలకు ఇచ్చే అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ఉద్యోగంలో మాత్రం బాగుంటుంది సాధారణమైన సమస్యలు కలుగుతాయి కాకపోతే అధికారులకు మీపైన ఉన్న నమ్మకం మిమ్మల్ని ఉన్నతంగా ఉంచే అవకాశం కలదు. జీవితభాగస్వామి విషయంలో మాత్రం చాలావరకు సర్దుబాటు విధానమే మేలుచేస్తుంది. విదేశీప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది ప్రయత్నం పెంచుట మేలు.   
      

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది వీటివిషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటి మూలాన సంతోషకరమైన వార్తను వినే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో మాత్రం మిశ్రమఫలితాలు పొందుతారు అలాగే ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. మిత్రుల నుండి నూతన విషయాలు,సమాచారం లభిస్తుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు కలుగుతాయి సమయానికి భోజనం చేయుట అనేది సూచన అశ్రద్ద కూడదు. వ్యాపార పరమైన విషయల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మాత్రం కొంత నిరాశజనకంగా ఉండే అవకాశం ఉంది అధికారుల మూలాన ఇబ్బందులు పొందుతారు వారి సూచనలు పాటించుట  వలన మేలుజరుగుతుంది. 

 

   

తులా రాశి :  ఈవారం మొత్తంమీద సోదరసంభందమైన విషయాలకు సమయం వెచ్చిస్తారు. వారినుండి వచ్చు సూచనలను బాగా ఆలోచించి వాటిని పూర్తిచేసే విషయంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో నూతన మార్పులకు అవకాశం కలదు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులతో కలిసి చేసిన పనుల విషయంలో ఆశించిన ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు.  ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి అధికమైన సమయం ఇచ్చే అవకాశం కలదు. వ్యాపారసంభందమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు నిర్ణయాలు తీసుకొనే ముందు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు,పూజలకు సమయం ఇస్తారు. విందులలో పాల్గొనే అవకాశం కలదు భోజనం విషయంలో నూతన ఇష్టాలను కలిగి ఉంటారు.  

 

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి నలుగురిని కలుపుకొని వెళ్ళుట మేలుచేస్తుంది. ఉద్యోగంలో చక్కటి ఫలితాలను పొందుతారు నూతన ప్రయత్నాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను ఆనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి అక్కడి నుండి నూతన సమాచారం సేకరించే ఆస్కారం కలదు. ఒకవార్తను వినడం వలన కొంత నిరాశను పొందుతారు సర్దుబాటు విధానం వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన వ్య్కతులతో కలిసి గతంలో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. విలువైన విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో నిర్ణయాన్ని  వేయుట మేలు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు.   

 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలతో సమయాన్ని గడుపుతారు వారినుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. తలపెట్టిన పనులను కాస్త నిదానంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో  తోటివారి నుండి చక్కటి సహకారాన్ని సహకారాన్ని పొందుటకు ఆస్కారం కలదు. స్వల్ప విభేదాలు రావడానికి ఆస్కారం కలదు సర్దుబాటు విధానం మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో కాస్త పనిఒత్తిడి పొందుతారు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళుట మంచిది. కుటుంబంలో చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయల్లో మాత్రం పెట్టుబడులు పెట్టకండి గతంలో చెఇస్న ఆలోచనలకు సమయం ఇవ్వడం మేలు. మిత్రులతో కలిసి చేసిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది  జాగ్రత్తగా వ్యవహరించుట సూచన నిదానం అవసరం.  

 

మకర రాశి  : ఈవారం మొత్తంమీద ఆరంభంలో స్వల్ప ఇబ్బందులు అలాగే ఆర్థికపరమైన సమస్యలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే హైరానాపడే అవకాశం కలదు. వ్యాపారపరమైన పెట్టుబడుల విషయంలో మాత్రం అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం మేలు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు అలాగే సమయాన్ని సరదాగా గడుపుతుంది. మిత్రులతో కలిసి చేసిన ఆలోచనలు అలాగే చర్చల విషయంలో నిదానంగా వ్యవహరించుట మంచిది ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. కుటుంబసభ్యుల మధ్య సహయసహకారాలు పెంచుకొనే ప్రయత్నాలు చేయుట అన్నివిధాల మంచిది. దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇస్తారు.  

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలను పొందుతారు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు,భోజనం విషయల్లో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. అధికారులతో చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు,వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది ప్రణాళికా బద్దంగా వ్యవహరించుట సూచన. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి చేసిన ఆలోచనలు ఊహించని మార్పులు పొందుతారు. అనవసరమైన పనులకు అలాగే వివాదాలకు దూరంగా ఉండుట సూచన. పెద్దలతో పరిచయాలు మీకు లబ్దిని చేకూరుస్తాయి. రాజకీయపరమైన విషయాల్లో ఆసక్తిని కలిగి ఉంటారు సంతోషకరమైన వార్తలను పొందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి సర్దుకుపోవడం వలన మేలుజరుగుతుంది.       

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. అధికారులతో చక్కటి సంభందాలు కలిగి ఉండే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి గతకొంత కాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ఊహించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కలదు. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో మీయొక్క ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో తోటివారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. ఓపికని కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది కొన్ని కొన్ని విషయాల్లో ఫలితాలు కాస్త నిదానంగా వచ్చే అవకాశం ఉంది. సోదరులతో కలిసి చేసిన చర్చలు మిశ్రమఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. 

మరిన్ని శీర్షికలు
visheshalu