Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nara rohit

ఈ సంచికలో >> సినిమా >>

రాజా చెయ్యి వేస్తే చిత్రసమీక్ష

raja cheyyi vesthe movie review

చిత్రం: రాజా చెయ్యి వేస్తే 
తారాగణం: నారా రోహిత్‌, ఇషా తల్వార్‌, నందమూరి తారకరత్న, శివాజీ రాజా, శశాంక్‌, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు 
సంగీతం: సాయి కార్తీక్‌ 
ఛాయాగ్రహణం: భాస్కర్‌ సాముల 
దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి 
నిర్మాత: రజనీ కొర్రపాటి 
నిర్మాణం: వారాహి చలన చిత్రం 
విడుదల తేదీ: 29 ఏప్రియల్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
సాక్ష్యాధారాలు లేకుండా హత్యలు చేయడంలో దిట్ట విజయ్‌ మాణిక్‌ (తారకరత్న). పోలీసు వ్యవస్థకి విజయ్‌ మాణిక్‌ గురించి తెలిసినా, ఏమీ చేయలేనంత తెలివిగా అకృత్యాలు చేయడమే అతని క్రిమినల్‌ బ్రెయిన్‌ గొప్పతనం. అలాంటి క్రిమినల్‌తో తలపడాల్సి వస్తుంది సాదీ సాదాగా లైఫ్‌ని లీడ్‌ చేసే కుర్రాడు రాజా రామ్‌ (నారా రోహిత్‌)కి. కథ చాలా సింపుల్‌గానే ఉంది. ఇందులో మలుపులేమిటి? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే 
చాలా ఈజ్‌తో రాజా రామ్‌ పాత్రలో నారా రోహిత్‌ ఒదిగిపోయాడుగానీ, ఫిట్‌నెస్‌ విషయంలో అతను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్షన్‌ సీన్స్‌లో బాగా చేశాడు. ఎమోషన్స్‌ బాగా పండించాడు. కామెడీ టైమింగ్‌ కూడా ఓకే. నెగెటివ్‌ రోల్‌లో తారకరత్న మరోసారి చెలరేగిపోయాడు. 'అమరావతి' సినిమా తర్వాత తారకరత్నకు నెగెటివ్‌ రోల్‌లో పేరు తెచ్చే చిత్రమవుతుందిది. ఆ తర్వాత ఆయన నెగెటివ్‌ రోల్‌లో చేసిన సినిమా కూడా ఇదే. తారకరత్న పాత్రని దర్శకుడు చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు.

హీరోయిన్‌గా ఇషా తల్వార్‌ బాగానే చేసింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. శ్రీనివాస్‌ అవసరాల ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.

కథ పాతదే. ఎన్నో సినిమాల్లో చూసిందే. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఆడియన్స్‌లో మూడ్‌ క్రియేట్‌ చెయ్యాలనుకున్నాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే మీద చాలా వర్క్‌ చేశాననుకున్నాడుగానీ, కొంచెం గందరగోళం అయిపోయింది. డైలాగ్స్‌ బాగున్నాయి. అక్కడక్కడా దర్శకుడి ప్రతిభ ఆడియన్స్‌ని ఆకర్షిస్తుంది. విలన్‌ పాత్రను డిజైన్‌ చేసిన తీరు దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. సంగీతం ఓకే. ఎడిటింగ్‌ లోపాలు కనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్పయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకి రిచ్‌నెస్‌ తెచ్చింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీపడలేదు నిర్మాత.

ఫస్టాఫ్‌ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. సాఫీగా సాగిపోయే ఫస్టాఫ్‌, అక్కడక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌, కాస్త రొమాన్స్‌, ఇంకాస్త యాక్షన్‌ ఇదీ ఫస్టాఫ్‌ కథ. సెకెండాఫ్‌లో కథ ఊపందుకుంటున్నట్లే కనిపిస్తుందిగానీ, అంతలోనే గందరగోళంగా ఉంటుంది. ట్విస్ట్‌లు ఎక్కువైపోయాయి. స్క్రీన్‌ప్లే పరంగా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. మామూలుగా హీరో మీద ఎక్కువ ఫోకస్‌ పెడ్తాడు ఏ దర్శకుడైనా. ఇందులో కాస్త భిన్నం. విలన్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. హీరో పాత్రపైనా అంతే ఫోకస్‌ పెట్టి ఉంటే బెటర్‌ ప్రోడక్ట్‌ అయ్యేది

ఒక్క మాటలో చెప్పాలంటే 
రాజా చెయ్యివేస్తే మరీ రాంగైపోలేదుగానీ

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka