Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
supreme movie review

ఈ సంచికలో >> సినిమా >>

బాలయ్యతో ఆ లక్కీ ఛాన్స్‌ దక్కేదెవరికో!

who will get lucky chance with balayya

చారిత్రాత్మక చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలయ్యకు ఈ సినిమా 100వ చిత్రం కావడంతో ఈ సినిమాలో ఓపెనింగ్స్‌ దగ్గర్నుంచీ అన్ని విషయాల్లోనూ సమ్‌థింగ్‌ స్పెషల్‌గా చిత్ర యూనిట్‌ అడుగులు ముందుకు వేస్తుండడం విశేషం. చారిత్రాత్మక కథలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉన్న క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్‌ పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'ప్రేమమ్‌' రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. అటు హిందీలోనూ, తమిళంలోనూ కూడా బిజీగా ఉంది. మరో పక్క గోవా బ్యూటీ ఇలియానా పేరు కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న ఇలియానాకి నిజంగా ఈ ఛాన్స్‌ దక్కితే అస్సలు వదులుకోదనే టాక్‌ ఇండస్ట్రీలో విన్పిస్తోంది. రాజకుమారి పాత్రలో ఇల్లీ బేబ్‌ కనబడాలంటే తన బక్క చిక్కిన బాడీని కొంచెం బొద్దుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది మరి. 'కిక్‌' సినిమా కోసం ఇలియానా కొంచెం బొద్దుగా తయారైంది. ఆ ఫిజిక్‌ అయితే ఇల్లీ బేబ్‌, బాలయ్య సరసన బాగా సూటయిపోతుంది. ప్రతిష్ఠాత్మక చిత్రం అయిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లో హీరోయిన్‌గా నటించే అవకాశం ఏ ముద్దుగుమ్మని వరిస్తుందో వేచి చూడాల్సిందే ! 

మరిన్ని సినిమా కబుర్లు
one more young villain comming to tollywood