Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lornce lucky, maskat lakshmiray

ఈ సంచికలో >> సినిమా >>

'అఆ' నితిన్‌ రేంజ్‌ మారిపోయింది

nitin range change with aaaa movie

నితిన్‌ సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టినా అతని రేంజ్‌ మరీ ఎక్కువగా పెరిగిపోలేదు కమర్షియల్‌గా. అంతకు ముందు నితిన్‌ చవిచూసిన ఫెయిల్యూర్స్‌, ఈ మధ్య వచ్చిన పరాజయాలే దానికి కారణం. అయితే దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుణ్యమా అని నితిన్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. నితిన్‌ హీరోగా రానున్న 'అఆ' సినిమా ఖచ్చితంగా 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. అది జరిగితే నితిన్‌ కెరీర్‌లో తొలసారిగా 50 కోట్ల మార్క్‌ దాటిన సినిమాని తన ఖాతాలో వేసుకోగలడు.

ఈ సినిమాలో సమంత హీరోయిన్‌. 'ఇష్క్‌', 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలతో పవన్‌కళ్యాణ్‌కి తాను వీరాభిమానినన్న విషయాన్ని నిరూపించుకున్న నితిన్‌, 'అఆ' సినిమాకి కూడా పవన్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా మార్చేశాడు. తమ్ముడికి అన్నగా అండగా ఉండాలి కదా అని పవన్‌ 'అఆ' ఆడియో ఫంక్షన్‌లో చెప్పడంతో నితిన్‌కి వెయ్యేనుగుల బలం వచ్చిందట. ఓవర్‌సీస్‌లో ఈ సినిమాపై మంచి హైప్‌ ఉంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలకి ఓవర్సీస్‌ బిజినెస్‌ చాలా కీలకం. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తీర్చిదిద్దాడు. త్రివిక్రమ్‌ బ్రాండ్‌, పవన్‌ ప్రమోషన్‌ కలిసి ఈ సినిమాకి కళ్ళు చెదిరేలా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యిందని సమాచారమ్‌. అతి త్వరలో విడుదల కానున్న 'అఆ' సినిమా నితిన్‌కి ఎలాంటి సంచలన విజయాన్ని ఇస్తుందో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam