Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
visheshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

13-05-2016 నుండి 19-05-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద అనుకోని ప్రయాణాలు పెరుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. నూతన ప్రయత్నాలు ఆరంభించుట మంచిది. మిత్రులతో కలిసి ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమతప్పదు,  అధికారులకు అనుగుణంగా నడుచుకోనుట మూలాన మేలుజరుగుతుంది . అనుకున్న పనులు నెరవేరక పోవచ్చును, సర్దుబాటువిధానం కలిగి ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వ్యాపారస్థులకు నిదానంగా వ్యవహరించుట సూచన. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. 

 

వృషభ రాశి ఈవారం మొత్తంమీద ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు ఉపయోగపడక పోవచ్చును. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించుట మంచిది, అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగులకు మాటను జాగ్రత్తగా వాడుట ఇబ్బందులు తగ్గుతాయి. అధికారులతో మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. వ్యాపారస్థులకు ఇబ్బందితప్పక పోవచ్చును నిదానం అవసరం. మనప్సర్తలు వచ్చుటకు ఆస్కారం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. 

                       

మిథున రాశి :  ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. మాటఇవ్వవలసి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. తలపెట్టిన పనులలో అనుకోని ఆటంకాలు కలుగుతాయి నిదానంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న వాటిలో మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పనిభారం తప్పకపోవచ్చును,సమయానికి భోజనం చేయుట మంచిది. వ్యాపారస్థులకు పెట్టుబడులు పెద్దగా అనుకూలించవు కావున తొందరపాటు వద్దు. నూతన ప్రయత్నాలు చేయకండి. కళారంగంలోని వారికి నూతన అవకశాలు అలాగే నూతన పరిచయాలు కలుగుట వలన సంతోశంను పొందుతారు.
 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద నూతన పనులలో సమయాన్ని గడుపుతారు,కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం కలదు. పెద్దలతో కలిసి పనిచేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ప్రణాలిక అవసరం సమయాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా అడుగులు ముందుకు వేయండి. ఉద్యోగులకు శ్రమకుతగ్గ ఫలితం లభిస్తుంది అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టుబడులకు అనుకూలం, ప్రయత్నం పెంచండి. 

 

           
సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఆలోచనలు పెరుగుటకు ఆస్కారం కలదు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ధనమునకు సంభందించిన విషయంలో ఆచితూచి వ్యవహరించుట మూలాన అనవసరపు ఖర్చులను తగ్గించుకోవచ్చును. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు,విందులలో పాల్గొనే అవకాశం ఉంది. పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు ఒకవార్త కొంత భాదను కలిగించేదిగా ఉంటుంది సర్దుబాటు అవసరం. వ్యాపారస్థులకు శ్రమపెరుగుతుంది,పనులలో అనుకోని ఆటంకాలు తద్వారా చికాకులు పెరుగుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. 
      

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులను కొంత ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఆరోగ్యంను మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పెద్దల నుండి ఆశించిన వార్తలు వినే అవకాశం కలదు. ఉద్యోగులకు  మిశ్రమఫలితాలు కలుగుతాయి,అధికారులతో కలిసి పనులకు సమాయన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును సర్దుకొని వెళ్ళండి తప్పక మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును కావున నిదానంగా వ్యవహరించుట సూచన. 

 

   

తులా రాశి :  ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో నూతన అవకశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలమైన ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది. మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. బందుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. జీవితబాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు బాగుంటుంది నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు. వ్యాపారస్థులకు లాభం ఉంటుంది తలపెట్టిన పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

 

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో ఒత్తిడి ఉంటుంది. పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుట వలన నిదానంగా పూర్తియ్యే అవకాశం ఉంది. ఉత్సాహంను కలిగి ఉండి మిత్రులతో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవ్చును. సమయానికి భోజనం చేయుట ముఖ్యం. ఉద్యోగులకు అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం ఉత్తమం. నూతన ప్రయత్నాలు చేయకండి నిదానం అవసరం. వ్యాపారస్థులకు పెద్దల వలన పనిభారం ఉంటుంది నిదానంగా వాటిని పూర్తిచేసే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. స్త్రీమూలక సమస్యలు తప్పక పోవచ్చును.
 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. పనుల విషయంలో కొంత ఒత్తిడిని పొందుటకు ఆస్కారం కలదు. సమయానికి భోజనం చేయుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. చిన్న చిన్న పనులకు సమయాన్ని ఇవ్వడం మంచిది. ఉద్యోగులకు పనిఒత్తిడి ఉంటుంది నలుగురితో మీ ఆలోచనలు పంచుకొనుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ఓపిక అవసరం కొంత పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. కళారంగంలోని వారికి బాగుంటుంది చేసిన పనులకు మంచి గుర్తింపు లబిస్తుంది అలాగే విందులలో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు లబ్దిని కలిగిస్తాయి.  

 

మకర రాశి  : ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఒకవార్త మూలాన కొంత భాదను పొందుటకు అవకాశం ఉంది సర్దుబాటు అవసరం. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. శుభకార్యములలో పాల్గొంటారు.  ఉద్యోగులకు అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. బందుమిత్రులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగనేఉంటుంది, చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది, అందరితో సరదాగా గడుపుతారు.  

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద పనులలో స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. నూతన పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచును. సమయాన్ని వృధాచేయకండి ఆలోచనలు అవసరం. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం మూలాన నిరాశను పొందుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు పెట్టబడులకు ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళారంగంలోని వారికి నూతన ఆలోచనలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది, నలుగురితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రతిపనిని ఆలోచించి చేపట్టుట ద్వార మేలుజరుగుతుంది. బందుమిత్రులతో కలిసి చేయుపనులలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. ఉద్యోగులకు అధికారుల వలన ఒత్తిడి ఉంటుంది వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. చివరి నిమిషంలో రుణం లభిస్తుంది. కళారంగంలోని వారికి పెద్దల ఆశిశ్సులు తోడ్పాటును అందజేస్తాయి,నూతన అవకశాలు లభించుటకు ఆస్కారం కలదు.  

మరిన్ని శీర్షికలు
sahiteevanam