Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with rashikhanna

ఈ సంచికలో >> సినిమా >>

నిండుగా మెరిసిపోతున్న బ్రహ్మూెత్సవం

brahmotsavam shining

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కే సినిమా అంటే సాంప్రదాయానికి, ఆధునికతకి పెట్టింది పేరు. అదే తరహాలో తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మూెత్సవం'. స్క్రీన్‌ నిండా ఆర్టిస్టులు, తెలుగుతనం ఉట్టిపడే నిండుతనం, భారీ సెట్టింంగ్స్‌తో నిజంగా పండగ వాతావరణాన్ని కళ్లకి కట్టినట్లుగా వుండబోతోంది ఈ సినిమా. అసలే అందగాడు..ఆ పై అంతమంది ముద్దుగుమ్మలు, ఇలా చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు. ప్రచార చిత్రాలతోనే ఇంతలా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు శ్రీకాంత్‌ అడ్డాల. అప్పట్లో కృష్ణవంశీ సినిమాల్లోనే ఈ తరహా వాతావరణం కనిపించేది.

ఇప్పుడు ఆ వారసత్వాన్ని శ్రీకాంత్‌ అడ్డాల అంది పుచ్చుకున్నాడనంలో అతిశయోక్తి లేదు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ కలర్‌ ఫుల్‌ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. 'శ్రీమంతుడు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్‌కు ఈ సినిమా కూడా బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించిపెట్టనుందని అభిమానులు భావిస్తున్నారు. సమంత, కాజల్‌, ప్రణీత 'బ్రహ్మూెత్సవం'లో మహేష్‌తో రొమాన్స్‌ చేయబోతున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటీమణులు జయసుధ, రేవతి, తులసి తదితరులు నటిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత ఆ స్థాయిలో తెర నిండుగా నటీనటులు కనిపిస్తున్న సినిమా ఇదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

మరిన్ని సినిమా కబుర్లు
gautamiputra satakarni song superb