Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
samanta was senior

ఈ సంచికలో >> సినిమా >>

బొద్దుతనమే ముద్దంటోన్న ముద్దుగుమ్మ

rashikhanna  likes looks chubby

హీరోయిన్స్‌ హద్దులు పెట్టుకుంటూ పోతే కెరియర్‌లో పైకి ఎదగలేం అంటోంది బొద్దుగుమ్మ రాశీఖన్నా. తాను సినీ రంగంలోకి వచ్చిన కొత్తల్లో ఎక్స్‌పోజింగ్‌ విషయంలో కొంచెం ఆలోచించేదట. కానీ తర్వాతర్వాత తెలిసొచ్చిందట ఈ ముద్దుగుమ్మకి. నటిగా ఎదగాలంటే అలాంటివన్నీ పక్కన పెట్టేయ్యాలని, అందుకే మెల్ల మెల్లగా తన సిద్ధాంతం పక్కన పెట్టేసి, గ్లామర్‌ డోస్‌ పెంచేసింది అందాల రాశి రాశి ఖన్నా. ప్రస్తుతం 'సుప్రీమ్‌' విజయాన్ని ఆస్వాదిస్తోంది రాశి. ఈ సినిమాతో నటిగా మరింత మంచి పేరు వచ్చిందని మురిసిపోతోంది.

నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమంటోంది. హీరోయిన్స్‌లో నటి అనుష్క అంటే తనకెంతో ఇష్టమనీ, ఎప్పటికైనా ఆమెతో కలిసి ఒక చిన్న పాత్రలో అయినా నటించాలనే తన మనసులోని కోరికని బయట పెట్టింది ముద్దుగుమ్మ. అంతే కాదు తాను సన్నగా ఉండే కన్నా కొంచెం బొద్దుగా ఉంటేనే అబ్బాయిలు తనను ఎక్కువ ఇష్టపడుతున్నారంటోంది. ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి 'ఆక్సిజన్‌' సినిమాలో నటిస్తోంది. రవితేజ, చక్రి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాలో కూడా రాశి హీరోయిన్‌గా నటించబోతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
mega heroin was comming