Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hest Pain Causes and Ayurveda Treatment in Telugu by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంప్రదాయం (వేసవి కవిత ) - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

sapradayam poetry

సంప్రదాయం

ఇంటికొచ్చిన అతిథికి
మంచి నీళ్లిచ్చి దాహం తీరుస్తాం
ఇది మన సంప్రదాయపు కనీస ధర్మం
రేపటి తరానికీ అది 
ఆచరణ యోగ్యం కావాలంటే
నేటి నుంచే శ్రద్ధ వహించాలి
నీటిని పరిరక్షించుకోవాలి!

నినాదాలు!

1. ఆనందబాష్పాలు..కన్నీళ్లు రెండూ నీళ్లే!
   ఏది కావాలో తెలుసుకోవడమే కనువిప్పు!
***
2. అన్నం పరభ్రహ్మ స్వరూపం!
   నీరు అంతకన్నా ముఖ్యావసరం!
***
3. నీటిని వృధాచేసి స్వర్గం చేజార్చుకోకు
   రేపటి నరకాన్ని నువ్వే సృష్టించుకోకు!
***
4. ఈనాటి ఇంకుడుగుంటలే
   రేపటి జలాశయాలు.
***
5. దీపం ఉండగనే ఇల్లు చక్కదిద్దుకోవాలి.
   నీరు దొరుకుతున్నప్పుడే పదిలపర్చుకోవాలి!
***
6. అన్నమో రామచంద్రా కాదు
    నీటి చుక్క మహాప్రభో అనుకునే రోజు రాకూడదు.
***
7. ఈనాటి ఇంకుడు గుంతలు..
   రేపటి తరానికి నీటి లంకెబిందెలు!
***
8. నేడు వాడుక నీటిలో నిర్లక్ష్యం..
    రేపు తాగునీటికి దుర్భిక్షం!   

మరిన్ని శీర్షికలు
Chintachiguru Mamsam