Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందం - చందం - మానస

 

వేసవి కాలంలో పొడి చర్మం కోసం చిట్కాలు

వేసవి కాలంలో పొడి చర్మం కారణంగా టానింగ్, దురద వంటి అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఇప్పుడు చెప్పుతున్న కొన్ని చిట్కాలను పాటిస్తే చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మంలో సహజ నూనెలు ఉంటాయి. అయితే పొడి చర్మంలో నూనెలు, తేమ లేకపోవటం వలన చర్మం పగుళ్లు, దురద మరియు పొరలుగా ఊడిపోవటం జరుగుతుంది. అందువలన వీటి నివారణకు ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

* వేడి నీటి స్నానం చేయటం వలన చర్మం నాశనం అవుతుంది. ఎక్కువ సేపు స్నానం చేయుట వలన  చర్మంలో సహజ నూనెలు మరియు తేమ పోతాయి. చర్మంలో సహజ నూనెలను పెంచాలంటే తక్కువ సేపు స్నానం చేయాలి.

* సరైన సబ్బులను ఉపయోగించాలి. మంచి సువాసన గల సబ్బులను ఉపయోగిస్తే చర్మంలో నూనెలను తగ్గించి పొడిగా మార్చేస్తాయి. అందువలన తక్కువ నురుగు ఉన్న సబ్బులు మరియు సువాసన లేని సబ్బులను ఉపయోగించాలి.

 
* టవల్ మృదువుగా మరియు నీరు ఇంకే విధంగా ఉండాలి. స్నానం అయ్యాక టవల్ తో మృదువుగా తుడుచుకోవాలి. చర్మం మీద కొంచెం తడి ఉండగానే  మాయిశ్చరైజర్ రాస్తే, చర్మంలో  అదనపు తేమ ఉండటానికి సహాయపడుతుంది.

 
* పొడి చర్మాన్ని తొలగించటానికి స్క్రబ్స్ వాడాలి. ఒక బౌల్ లో అరస్పూన్ విటమిన్ ఇ ఆయిల్, అరస్పూన్ గ్లిసరిన్, రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి.

 
* ఒక స్పూన్ వెచ్చని ఆలివ్ ఆయిల్,కొన్ని చుక్కల గ్లిజరిన్,రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి.

 
* ఒక స్పూన్ పాల క్రీంలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి స్నానానికి వెళ్ళటానికి పది నిమిషాల ముందు ముఖానికి రాయాలి.

* పాలను ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.

 
* వేసవికాలంలో వేడి నీటి స్నానాన్ని మానేయాలి.

 
* తాజా కలబంద జెల్ ని నేరుగా చర్మం మీద రాయాలి.

  
* రాత్రి పడుకొనే ముందు ముఖానికి గ్లిజరిన్ రాసి,మరుసటి రోజు ఉదయాన్నే కడగాలి. 

మరిన్ని శీర్షికలు
beauty of rajsthan