Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with samanta

ఈ సంచికలో >> సినిమా >>

ముద్దుగుమ్మ కాజల్‌కేమైంది..?

what happend to kajal

టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కేమైంది.. ఈ మధ్య రొమాంటిక్‌ సీన్లలో కొంచెం దూరంగా ఉంటోందట. ముద్దు సీన్లకైతే మరీ డైరెక్టర్స్‌ని ఇబ్బంది పెడ్తుందట. అప్పుడెప్పుడో 'ఆర్య-2' సినిమాలో అల్లు అర్జున్‌తో లిప్‌ లాక్‌ చేయించుకుంది ఈ ముద్దుగుమ్మ. మహేష్‌తో బిజినెస్‌మేన్‌' సినిమాలో కూడా కాజల్‌కు లిప్‌లాక్‌ సీను ఉంది. అప్పుడు లిప్‌ లాక్‌కి నో చెప్పని ఈ బ్యూటీ ఇప్పుడెందుకు నో అంటోంది. తాజాగా కాజల్‌ అగర్వాల్‌ బాలీవుడ్‌లో రణ్‌దీప్‌ హుడాతో కలిసి 'దో లఫ్జోన్‌ కీ కహానీ' సినిమాలో నటిస్తోంది.

ఆ సినిమాలో హీరో, హీరోయిన్‌కీ మధ్య ఒక గాఢమైన సీన్‌ కోసం డైరెక్టర్‌ లిప్‌లాక్‌ సీన్‌ ఏడ్‌ చేయడం జరిగిందట. ఆ సీన్‌ గురించి కాజల్‌కి ముందుగా తెలియకపోవడంతో ఆ సీన్‌లో నటించడానికి తెగ ఇబ్బంది పడిపోయిందట.దాంతో చిత్ర బృందం అంతా షాక్‌ తిన్నారట. బాలీవుడ్‌లో లిప్‌లాక్‌ సీన్స్‌ అనేవి చాలా కామన్‌. అలాంటిది మన ముద్దుగుమ్మ ఎందుకిలా చేసిందా.. అని అందరూ ఆశ్చర్యపోయారట. ఆ తరువాత ఆ సీన్‌ ఎలాగూ ఓకే అయ్యిందిలెండి..ఏది ఏమైనా కాజల్‌ లిప్‌లాక్‌ సీన్‌ మాత్రం ఈ సినిమాకి మాంచి పబ్లిసిటీ అయ్యిందనే చెప్పాలి. తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయినా, తమిళంలోనూ మంచి గుర్తింపు ఉన్నా, బాలీవుడ్‌లో ఈ అమ్మడికి ఇంకా ఆ స్థాయి గుర్తింపు రాలేదు. 

మరిన్ని సినిమా కబుర్లు
NTR in janata garrage