Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
what happend to kajal

ఈ సంచికలో >> సినిమా >>

'జనతా గ్యారేజ్‌'లో ఎన్టీఆర్‌ కెవ్వుకేక

NTR in janata garrage

'నాన్నకు ప్రేమతో' అంటూ న్యూలుక్‌తో ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. లుక్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, ఆ లుక్‌ని అభిమానులు రిసీవ్‌ చేసుకుంటారో లేదోనని టెన్షన్‌ పడ్డాడట ఈ యంగ్‌ హీరో అప్పట్లో. కానీ సినిమా విడుదలకు ముందే ఆ లుక్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. సినిమా కూడా సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' సినిమాలో మరో డిఫరెంట్‌ లుక్‌తో మన ముందుకు రాబోతున్నాడు. 'ఇచ్చట అన్నీ రిపేర్‌ చేయబడును' అనే క్యాప్షన్‌తో, ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. కొరటాల డైరెక్షన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు కొరటాల, ఎన్టీఆర్‌ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరియర్‌లో ది బెస్ట్‌ కానున్నదని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఈ సినిమాలో మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సమంత, నిత్యామీనన్‌లు జూనియర్‌కు జంటగా నటిస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీప్రసాద్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో పలు మ్యూజికల్‌ హిట్‌ చిత్రాలొచ్చాయి. ఆ మ్యాజిక్‌ ఈ సినిమాతోనూ రిపీట్‌ అవనుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
experments doing by milky beauty