Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR in janata garrage

ఈ సంచికలో >> సినిమా >>

ప్రయోగాలు చేస్తున్న మిల్కీ బ్యూటీ

experments doing by milky beauty

 టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. 'బాహుబలి' సినిమా తన కెరీర్‌కే పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. నిన్న మొన్నటి వరకూ అమ్మడు గ్లామర్‌ పాత్రలకే పరిమితం అవ్వాలనుకుంది. కానీ ఇప్పుడు మనసు మార్చుకుందిట. నటనకు ప్రాధాన్యత గల పాత్రలకు, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కే చిత్రాలకూ పచ్చజెండా ఊపింది.

ఈ విషయంలో మాత్రం తనకు స్వీటీ అనుష్కనే ఇన్సిపిరేషన్‌ అంటోంది. అందుకే 'అభినేత్రి' అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీకి కమిట్‌ అయ్యింది ఈ మిల్కీ బ్యూటీ. ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' తో బిజీగా ఉన్న తమన్నా త్వరలో 'అభినేత్రి' పాత్రలో అలరించనుంది. గ్లామరస్‌ హీరోయిన్‌గా తగిన గుర్తింపు తెచ్చుకున్న తాను, నటిగానూ ప్రూవ్‌ చేసుకున్నప్పటికీ, ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతోనే హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ చేయాలనుకుంటున్నట్లు తమన్నా చెబుతోంది. అంటే మిల్కీ బ్యూటీ గ్లామర్‌, డాన్సులే కాదు, డీ గ్లామర్‌ లుక్‌లో కూడా ఆమె పెర్ఫామెన్స్‌తో అదుర్స్‌ అనిపించనుందన్నమాట. 

మరిన్ని సినిమా కబుర్లు
charan attracts with new look