Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
brahmostavam movie review

ఈ సంచికలో >> సినిమా >>

సమంతతో ఇంటర్వ్యూ

interview with samanta
క‌థానాయిక‌లకూ మ‌రో వ్యాప‌కం ఉంటే బాగుంటుందేమో?! - స‌మంత‌
 
స‌మంత మాయ చేసింది. తొలిచూపులోనే అంద‌ర్నీ హోల్‌సేల్ గా ప‌డేసింది. గౌత‌మ్ మీన‌న్ ఫ్రేమ్‌లో అందంగా ఫిక్స‌యిపోయిన స‌మంత‌ని చూసి.. జ‌నాలు ప్రేమ‌లో ప‌డిపోయారు. అక్క‌డ ప‌డింది... ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌ళ్లీ లేవ‌లేదు. స‌మంత‌కు ఫ్లాప్స్ వ‌చ్చాయి. కాంట్ర‌వ‌ర్సీలో ప‌డింది.. ప్రేమ వ్య‌వ‌హారంలో దెబ్బ‌తింది.. గ్లామ‌ర్ తగ్గింది.. అయినా ఆమెపై ప్రేమ త‌గ్గ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ పుంజుకొని.. మునుప‌టి వేడి చూపిస్తోంది. బ్ర‌హ్మోత్స‌వం, అఆ, జ‌న‌తా గ్యారేజ్‌.. ఇలా బిజీ బిజీగా ఉంది. తెలుగు, త‌మిళం రెండు చోట్లా త‌న హ‌వా చూపిస్తోంది. ఆమె న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ఈ సంద‌ర్భంగా స‌మంత‌తో చిట్ చాట్‌..

* 24తో త‌మిళంలోనూ ఓ హిట్టు అందుకొన్నారు... కంగ్రాట్స్‌
- థ్యాంక్సండీ. త‌మిళంలో నాకంటూ ఓ మంచి విజ‌యం ఉండాల‌ని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. నా వంతుగా నేను క‌ష్ట‌ప‌డ్డాను కూడా. కానీ ఫ‌లితాలు మాత్రం ఇప్పుడిప్పుడే వ‌స్తున్నాయి. తెరి క‌మ‌ర్షియ‌ల్‌గా బాగా ఆడింది. ఇప్పుడు.. 24కి గొప్ప స్పంద‌న ల‌భిస్తోంది. ఐ యామ్ హ్యాపీ.

* అయితే ఈ రెండు చిత్రాల్లోనూ మీ పాత్ర‌కు ప్రాధాన్యం అంతంత మాత్ర‌మే క‌దా?
- కావొచ్చు. కాక‌పోతే... కొన్ని కొన్నిసార్లు అలాంటి విష‌యాల‌కు అంత ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌దు. 24లో నా పాత్ర‌కు ప్రాధాన్యం ఏముంది? అనుకొంటే ఓ గొప్ప సినిమా మిస్స‌యిపోయేదాన్ని. కొంత‌మందితో ప‌నిచేయ‌డాన్ని ఎప్పుడూ గ‌ర్వ‌ప‌డుతుంటా. అలాంటి వారిలో విక్ర‌మ్ కె.కుమార్ ఒక‌రు. మ‌నంలో నా పాత్ర ఎంత బాగా డిజైన్ చేశారో చూశారు క‌దా. అలాంటి ద‌ర్శ‌కుడు ఓ క‌థ‌తో వ‌స్తే.. నేను ఎందుకు ఆలోచించాలి. సూర్య నా అభిమాన క‌థానాయ‌కుడు. ఆయ‌నంటే పిచ్చి. అలాంటి సూర్య‌తో న‌టించ‌డం ఓ అదృష్టం. అందుకే.. 24 విష‌యంలో నాకెలాంటి లోటు పాట్లూ లేవు.

* తెలుగు, త‌మిళం అటూ ద్విభాషా చిత్రాల్లో ఎక్కువ న‌టిస్తున్నారు, కార‌ణ‌మేంటి?
- క‌థానాయిక‌లుగా మాకున్న సౌల‌భ్యం అదే క‌దా?  రెండు చోట్లా నాకుగుర్తింపు ఉంది. ఓ సినిమాని రెండు భాషల్లో విడుద‌ల చేస్తే, రెండు చోట్లా మంచి గుర్తింపు వ‌స్తే... డ‌బుల్ బొనాంజానే క‌దా.

*  మ‌హేష్‌తో మూడోసారి న‌టించారు... ఇంత‌కీ బ్ర‌హ్మోత్స‌వం అనుభ‌వాలేంటి?
- మ‌హేష్‌తో ఎప్పుడు ప‌నిచేసినా స‌ర‌దాగా ఉంటుంది. దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఈ రెండు సినిమాలూ బాగా ఆడాయి. వాటిలో నా పాత్ర‌కూ మంచి పేరొచ్చింది. మేం త‌ప్ప‌కుండా హ్యాట్రిక్ కొడ‌తాం.. చూస్తుండండి.

* అంత న‌మ్మ‌కం దేనిపైన‌?
- శ్రీ‌కాంత్ అడ్డాల క‌థ‌లు కుటుంబ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతాయి. ఈమ‌ధ్య ఇలాంటి సినిమా రాలేదు. కుటుంబ‌మంతా క‌ల‌సి థియేట‌ర్‌కి వెళ్తే.. ఆ సంద‌డే వేరుగా ఉంటుంది.

* మీతో క‌ల‌సి ముగ్గురు హీరోయిన్లున్నారు. మ‌రి మీ పాత్ర‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయిన‌ట్టు అనిపించ‌లేదా?
- బ్ర‌హ్మోత్స‌వం పోస్ట‌ర్లు, ట్రైల‌ర్లు చూడండి.. క‌నీసం ఓ వంద‌మంది క‌నిపిస్తారు. శ్రీ‌కాంత్ అడ్డాల క‌థ‌ల్లో ఉన్న గొప్ప‌ద‌నం ఏమిటంటే.. ఆయ‌న క‌థలో ప్ర‌తీ పాత్ర‌కూ ప్రాధాన్యం ఉంటుంది. క‌థ విన‌గానే ఒప్పుకోల‌వాల‌నిపించింది. అంతే త‌ప్ప‌.. ఇందులో క‌థానాయిక‌లెంత‌మంది ఉన్నారు, నా పాత్ర నిడివి ఎంత‌?  అనే ప్ర‌శ్న‌లు వేయ‌లేదు.

* అ.. ఆ కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది క‌దా, ఆ సంగ‌తులేంటి?
- త్రివిక్ర‌మ్ మార్క్ సినిమా కాదిది. ఇది వ‌ర‌కు ఆయ‌న సినిమాలు ఎలా ఉంటాయో.. వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కాక‌పోతే.. కామెడీ మాత్రం మిస్ అవ్వ‌దు.

* లేడీ ఓరియెంటెడ్ క‌థ అంటున్నారు..
- అలాంటిదేం లేదు. ఇందులో క‌థే హీరో. దాన్ని అన్ని పాత్ర‌లూ స‌మానంగానే నిల‌బెడ‌తాయి. నా పాత్రలో ఉన్న కొత్త‌ద‌నం ఏంటంటే... తొలిసారి నేనూ పంచ్‌లు వేశా (న‌వ్వుతూ)

* ఈమ‌ధ్య మీకొస్తున్న పాత్ర‌ల ప‌ట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా?
- పూర్తి సంతృప్తితో ఉన్నా. స‌మంత‌కు ఇలాంటి పాత్ర‌లు కూడా రాయెచ్చు.. అని ద‌ర్శ‌కులు భావిస్తున్నారు. ఆ విష‌యంలో ఆనందంగా ఉంది. ఓవ‌రాల్‌గా చూస్తే.. క‌థానాయిక‌కి ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ విష‌యంలో సంతోషంగా ఉన్నా.

* స‌మంత నిర్మాత‌గా మార‌బోతోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి..
- అలాంటిదేం లేదు. మారితే మంచిదే. కానీ ఇప్ప‌టికిప్పుడు ప్రొడ‌క్ష‌న్ పై దృష్టి పెట్ట‌లేను.

* క‌థానాయిక‌లంతా వ్యాపార వ్య‌వ‌హారాలంటే మ‌రో వ్యాపకం చూసుకొంటున్నారు. మీకూ అలాంటి ఆలోచ‌న‌లున్నాయా?
- మ‌రో వ్యాపకం ఉంటే బాగుంటుంది. కానీ.. ప్ర‌స్తుతానికి నాకున్న స‌మ‌య‌మంతా సినిమాల‌కే స‌రిపోతోంది. అయితే ఎప్పుడైనా ఓ మంచి ఆలోచ‌న వ‌స్తే... త‌ప్ప‌కుండా మీర‌న్న విష‌యంపై దృష్టి పెడ‌తా.

* స‌మంత ఈమ‌ధ్య వంట చేస్తోంద‌ట‌...
- (న‌వ్వుతూ) మీకా విష‌యం ఎవ‌రు చెప్పారు, వంట అంటే.. బిరియానీలూ గ‌ట్రా చేయ‌డం లేదండీ. జ‌స్ట్ మొన్నామ‌ధ్య ఓ కేక్ త‌యారు చేశా. తిన‌డాన‌కి అంద‌రూ భ‌య‌ప‌డ్డారు.

* పెళ్లి ఆలోచ‌న‌లున్నాయా?
- చేసుకొంటా. కానీ ఇప్పుడు కాదు. టైమ్ ఉంది.

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
what happend to kajal