Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

బ్రహ్మోత్సవం చిత్ర సమీక్ష

brahmostavam movie review

చిత్రం: బ్రహ్మూెత్సవం 
తారాగణం: మహేష్‌బాబు, కాజల్‌, సమంత, ప్రణీత, సత్యరాజ్‌, రావు రమేష్‌, జయసుధ, రేవతి, సీనియర్‌ నరేష్‌, కృష్ణ భగవాన్‌, షయాజీ షిండే, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, బేబి అక్షర తదితరులు. 
సంగీతం: మిక్కీ జె మేయర్‌ 
ఛాయాగ్రహణం: రత్నవేలు 
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల 
నిర్మాతలు: పెర్ల్‌ వి పొట్లూరి, పరవమ్‌ వి పొట్లూరి, కవిన్‌ అన్నె, మహేష్‌బాబు 
నిర్మాణం: పివిపి, మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
విడుదల తేదీ: 20 మే 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంటబ్బాయి (సత్యరాజ్‌). కుటుంబమంతా కలిసే ఉండాలని అనుకుంటాడు. తన చెల్లెళ్ళనీ, వారి కుటుంబాల్నీ కలిపి తనతోపాటే ఒకే చోట ఉంచుతాడు. తండ్రి వ్యాపారాల్ని చూసుకుంటూ ఉంటాడు కొడుకు (మహేష్‌). అయితే, ఆ ఉమ్మడి కుటుంబంలోని ఓ వ్యక్తి (రావు రమేష్‌) ఓ సందర్భంలో, చంటబ్బాయిని అపార్ధం చేసుకుని, అతనితో గొడవ పెట్టుకుంటాడు. ఆ బాధతో చంటబ్బాయి కన్నుమూస్తాడు. అక్కడినుంచి, తన తండ్రి మరణానికి కారణమైన అపార్ధాన్ని అర్థం చేసుకుని, తన మావయ్యకు ఆ విషయాన్ని తెలియజేసి, కుటుంబాన్ని కలిసి ఉంచడానికి చంటబ్బాయ్‌ కొడుకు పడే కష్టం తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
మహేష్‌ మునుపటి కన్నా అందంగా, యంగ్‌గా కనిపించాడని ప్రతి సినిమాకీ చెప్పుకుంటున్నాం. సినిమా సినిమాకీ అతనిలోని ఛార్మింగ్‌ లుక్‌ మెరుగవుతోంది తప్ప తగ్గడంలేదు. రొమాంటిక్‌ సీన్స్‌లోనూ, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మహేష్‌ నటన అద్భుతం. బరువైన సన్నివేశాల్ని ఈజ్‌తో చేశాడనడం కన్నా, ఆ సన్నివేశాల్లో మహేష్‌ జీవించాడనడం సబబు.

కాజల్‌, సమంత గ్లామరస్‌గా కనిపించారు. తెరపై అందంగా కనిపించడమే కాకుండా తమ నటనతో ఆకట్టుకున్నారు. ప్రణీత కూడా బాగా చేసింది. రావురమేష్‌కి దర్శకుడు తన ప్రతి సినిమాలోనూ మంచి మంచి పాత్రల్ని ఇస్తుంటాడు. ఇందులోనూ అంతే. తనకిచ్చిన పాత్రలో రావు రమేష్‌ ఒదిగిపోయాడు. తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సత్యరాజ్‌, చంటబ్బాయ్‌ పాత్రలో బాగా చేశాడు. మనసుకు హత్తుకునేలా ఉందతని పాత్ర. జయసుధ, రేవతి, తనికెళ్ళ భరణి, ఇంకా ఇతర తారాగణం అంతా తమ అనుభవాన్ని రంగరించారు.

కథ కొత్తదేమీ కాదు. పాత కథే అయినా, ఈ మధ్య ఇలాంటి కథలకు మంచి అప్లాజ్‌ లభిస్తుండడం అభినందనీయమే. అయితే చెప్పాలనుకున్న విషయానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ తప్పనిసరి. అది లోపిస్తే, మంచి కథ కూడా వీకయ్యే ఛాన్సుంది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ తక్కువే అయ్యింది. దాంతో సినిమా చాలా డల్‌గా సాగుతున్నట్లు అన్పిస్తుంది. స్క్రీన్‌ప్లేలోనూ అక్కడక్కడా లోపాలున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. ఆద్యంతం అద్భుతమైన రిచ్‌నెస్‌ కనిపిస్తుందంటే, నిర్మాణపు విలువలే అందుక్కారణం. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరమనిపిస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.

సినిమా అంతా రిచ్‌గా కనిపిస్తుంది. తెరనిండా బోల్డంతమంది తారలు. రొటీన్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌కి భిన్నంగా సినిమా సహజంగా అనిపిస్తుంది. కానీ, టైటిల్‌లోని ఉత్సవం, అందులోని ఉత్సాహం తెరపై అంతగా కనిపించదు. ఎమోషన్‌ క్వాంటిటీ పెరిగి, ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గడం కొంచెం నిరాశ కలిగించవచ్చు. కుటుంబ విలువల్ని గొప్పగా చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం అభినందించదగ్గది. అలాగే, ఇలాంటి సినిమాని ఓకే చేసినందుకు మహేష్‌నీ అభినందించాలి. ఫస్టాఫ్‌ మంచి ఫీల్‌తో సాగిపోతుంది. సెకెండాఫ్‌లోనూ అంతే. అయితే ఉత్సాహం తగ్గడం కొంచెం నిరాశపరుస్తుంది. ఓవరాల్‌గా సినిమా, మాస్‌ ఆడియన్స్‌ని, కమర్షియల్‌ ఆడియన్స్‌నీ మెప్పించడం అనుమానమే. క్లాస్‌ ఆడియన్స్‌ని మాత్రం కొంత మేర మెప్పించవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే 
'బ్రహ్మూెత్సవం' టైటిల్‌లోని ఉత్సవం, ఆ ఉత్సవంలోని ఉత్సాహం తగ్గాయి 
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with samanta