Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందం - చందం - మానస

వేసవిలో చర్మ సౌందర్యన్ని ఇలా కూడా కాపాడవచ్చు..
సాధారణంగా అందం విషయంలో చాలా మంది మహిళలు ఎక్కువ శ్రద్దతీసుకొంటారు. అందుకోసం బయట బ్యూటీ ప్యార్లర్స్ కు వెళ్ళే వాళ్ళు కొంతమందైతే మరికొంత మంది ఇంట్లోనే కొన్ని హోంమేడ్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తుంటారు. అలా సహజంగా మీ చర్మంలో మెరుపులు తీసుకు రావాలనుకొంటే కొన్ని సాధారణంగా మనం  ఉపయోగించే పదార్థాలతో పేస్ ప్యాక్ లు వేసుకోవచ్చు. ఆ పదార్థాలు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు. ఇంకా మసాలా దినుసులు కావచ్చు. చాలా సార్లు పండ్లతో వేసుకొనే ఫేస్ ప్యాక్ ల గురించి మనకు చాలానే తెలుసు. ముఖ్యంగా నిమ్మ, స్ట్రాబెర్రీ, అరటి, బొప్పాయి, ఇలాంటి వాటితో చాలా ఫేస్ ప్యాక్ లు, ఫేస్ వాష్ లు వేసుకొనే ఉంటారు. అదే కూరగాయలతో ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ..! కొన్ని కూరగాయలు అందానికి ఔషధాలుగా పనిచేస్తాయి. అందుకే చాలా మంది మహిళలు కూరగాయలతో(క్యారెట్, పొటాటో, టమోటోలతో) ఫేస్ ప్యాక్ లను వేసుకొంటారు. ఇవి చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి వెజిటేబుల్స్ తో హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను ఎలా వేసుకోవాలో మీకోసం కొన్ని....


క్యారెట్ ఫేస్ ప్యాక్:

భూమి(మట్టి)లోనే కాచే కూరగాయలు(దుంపలు)లో ‘విటమిన్ ఎ'అధికంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ ఎ సున్నితమైన చర్మానికి చాలా అవసరం. ఇది నేచురల్ గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్ మరియు సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి క్యారెట్ ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె మరియు పాలు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఐదు నిముషా పాటు మసాజ్ చేయాలి. ఇలా చేసిన ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే కాదు ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మోచేతులు, మోకాళ్ళమీద కూడా రుద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మోచేతులు, మోకాళ్ళు తెల్లగా మారవచ్చు.

కీరదోసకాయ:

మెరిసే చర్మానికి మరో అద్భుతమైనటువంటి వెజిటేబుల్ కుకుంబర్(కీరదోసకాయ). కీర దోసకాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని టైట్ చేయడమే కాకుండా యంగ్ గా కనబడేలా చేస్తుంది. మరింత మంచి ఫలితం పొందాలంటే దీనికి కొంచెం నిమ్మరసం కలిపి అప్లై చేసుకోవచ్చు.

బీట్ రూట్ ఫేస్ ప్యాక్:

దుంపలులో ‘విటమిన్ ఎ'అధికంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ ఎ సున్నితమైన చర్మానికి చాలా అవసరం. ఇది నేచురల్ గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్ మరియు సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి బీట్ రూట్ ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె మరియు పాలు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఐదు నిముషా పాటు మసాజ్ చేయాలి. ఇలా చేసిన ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. క్యాబేజ్: క్యాబేజి తినడానికి రుచికి మాత్రమే కాదు ఇటు ఆరోగ్యం పరంగాను, అటు అందం పరంగాను చాలా బాగా పనిచేస్తుంది. దీంతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి తాజాదనం వస్తుంది. ఇంకా కళ్ళ క్రింద ఉబ్బగా ఉన్న, బ్లాక్ సర్కిల్స్ ఉన్నా పోగొడుతుంది. క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.

పొటాటో (బంగాళదుంప)ఫేస్ ప్యాక్:

వెజిటేబుల్ తో వేసుకొనే ఫేస్ ప్యాక్ లలో ఇది కూడా ఒకటి. మీ చర్మం పొడిబారిఉన్నట్లైతే బంగాళదుంపను చిదిమి లేదా చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి బాగా మసాజ్ చేయాలి. ఇది ముఖానికి మాయిశ్చరైజర్ గా పనిచేసి ముఖం మీద దురద, మంట వంటివి లేకుండా చేస్తుంది. బంగాల దుంపను తురిమి అందులో ఒక చెంచా పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటో ఫేస్ ప్యాక్:


బాగా పండిన టమోటోను బాగా చిదిమి, అందులో కొద్దిగా నిమ్మరసం పిండి, అర చెంచా ముల్తానీ మట్టి, సాండిల్ వుడ్ పౌడర్ ను మిక్స్ చేసి, ఈ వెజిటేబుల్ ఫేస్ ఫ్యాక్ ను ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. ఇది బాగా ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్ర చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది. టమోటోతో ఇంకా చాలా ఫేస్ ప్యాక్ లను ఇంట్లో ప్రయత్నం చేయవచ్చు. టమోటో-షుగర్, టమోటో-నిమ్మరసం-పాలు, టమోటో-తేనె, నిమ్మరసం, టమోటో-పెరుగు లేదా ఉప్పు ఇలా.. ఎదైని రెండు లేదా మూడు మిశ్రమాలతో వెజిటేబుల్ ప్యాక్ వేయడం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంత అవుతుంది.

మరిన్ని శీర్షికలు
avee - ivee