Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of rajasthan

ఈ సంచికలో >> శీర్షికలు >>

27-05-2016 నుండి 2-06-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ రాశివారికి ధనలాభాలు ఉనప్పటికిని కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు పొందుతారు, ధర్మసంభంద పనులకు సమయాన్ని కేటాయించుట మంచిది. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు కావున నిదానంగా ఉండటం సూచన. చేసేపనులలో ఆటంకాలు కలుగుతాయి అధికమైన ప్రయత్నం అవసరం. సమయానికి భోజనంచేయలేరు పనిఒత్తిడి ఉండుటకు అవకాశం కలదు జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులతో సఖ్యతగా ఉండటం సూచన. మీయొక్క వ్యతిరేకుల మూలాన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు.

 

వృషభ రాశి ఈరాశివారు ఈవారం ప్రారంభంలో సంతోషంగా గడుపుతారు బంధువులను కలిసే అవకాశం కలదు. భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు.  అర్థికంగాకూడా లాభాలను పొందుటకు అవకాశం ఉంది.నూతన ఆలోచనలనుచేస్తారు ఆదిశగా ముందుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు కాని వారం మధ్యలో కొంత ఇబ్బందులను అకారణంగా ఖర్చులను పొందుతారు.మానసికంగా ఆందోళనను పొందుతారు. భోజనంవిషయంలో సమయపాలన పాటించుట మేలుచేస్తుంది కొద్దిపాటిఅనారోగ్యం కలుగుటకు ఆస్కారం ఉంది. ఏవైనా నిర్ణయాలు తీసుకోనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధార్మికకార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

                       

మిథున రాశి :  ఈరాశివారికి ఉద్యోగంలో మాత్రం అభివృద్దిని కలిగిఉంటారు. రాజాకీయాల్లో ఉన్నవారు విజయాన్ని పొందుతారు తాముఆశించిన ఫలితాలను పొందుటకు అవకాశంకలదు. స్వల్ప అనారోగ్యసమస్యలు ఇబ్బందిపెట్టుటకు అవకాశంకలదు జాగ్రత్తవహించుట మేలు. మీయొక్క మాటతీరు కుటుంభంలోని సభ్యులను భాదించేదిగా ఉండుటకు అవకాశం ఉంది. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు చేపట్టిన పనులను సకాలానికి అవజేస్తారు. మీయొక్క ఆలోచనలు కొన్నివిషయాల్లో తిరస్కరించబడుటకు అవకాశం కలదు సర్దుకుపోవడం మంచిది. కొద్దిగా ప్రయాణాలను ఎక్కువగా చేయుటకు అవకాశం కలదు   

 

 

కర్కాటక రాశి : ఈరాశివారికి ఉద్యోగంలో అభివృద్దిని కలిగిఉంటారు అధికారులతో గుర్తింపును పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించుట వలననష్ట పోకుండా జాగ్రత్తపడగలరు. గతంలో చేపట్టినపనులను పూర్తిచేసేందుకు ప్రయత్నం చేయుట ఉత్తమం. కుటుంభంలో సర్దుబాటు ఆలోచనలను చేసినచో వివాదములు సమసిపోవుటకు ఆస్కారం ఉంది, పెద్దల ఆలోచనలు పాటించుట మంచిది. బంధుమిత్రులతో కుడా నిదానం ఉండటం సూచన.  క్రిందిస్థాయి ఉద్యోగులమూలాన కొంత లబ్దిని పొందుతారు. విదేశీప్రయాణాలు చేయవలసి రావోచ్చును, నూతన పరిచయాలు కలుగుతాయి. 

 

           
సింహ రాశి : ఈ రాశివారికి ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతనపనులను చేపడుతారు. ఆర్థికపరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. బంధుమిత్రులతో మాత్రంమీకు స్వల్పవిభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. మానసికంగా కొంత ఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. వినొదముల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు అందరితోను సరదాగా గడుపుటకు ప్రయత్నంచేస్తారు. గతంలో ఆరంభించి మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తిచేసేప్రయత్నం చేయండి. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు.        
      

 

కన్యా రాశి : ఈరాశివారికి తలపెట్టినపనులలో ఆర్థికంగాలాభాలను పొందుతారు, చేపట్టిన పనుల్లో అనుకూలతలు కలుగుతాయి . భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండటంమంచిది. ప్రయాణాలమూలాన ఇబ్బందులను ఎదుర్కొంటారు, సాధ్యమైనంత వరకు వాటిని వాయిదా వేయుట మంచిది. మీరు తీసుకున్ననిర్ణయాల మూలాన మాటనుపడవలసి రావోచ్చును. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు మీయొక్క విజయాన్ని కోరుకొనే ఆత్మీయుల ఆలోచనలను పాటించుటకు ప్రయత్నం చేయండి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. కాస్త శ్రమించుట ద్వార విజయాన్ని సొంతం చేసుకోవచ్చును.     
          

   

తులా రాశి : ఈరాశివారికి అన్నిరకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనేఅవకాశం ఉంది. ముఖ్యంగా మీయొక్క మాటతీరు మూలాన అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా లేనట్లయితే ధననష్టాన్ని చవిచూస్తారు. సౌఖ్యంనకు ప్రాముఖ్యతను ఇస్తారు మానసిక సంతోషాలకు ప్రాధాన్యతలను ఇచ్చుటకు ఆస్కారం కలదు. మీరు తీసుకొనే నూతన నిర్ణయాలను వాయిదావేసుకోవడం చాలావరకు మేలుచేస్తుంది. స్త్రీలకు సంభందించిన విషయాల్లో తలదూర్చకండి వివాదములు కలుగుతాయి. మీ తెలివితేటలను వాడుకొనే ప్రయత్నంచేయండి తద్వార చేపట్టిన పనులను ముగించగలుగుతారు.

 

    

వృశ్చిక రాశి  : ఈ రాశివారికి ఉద్యోగస్థానంలో బాగుంటుంది మీయొక్క ఆలోచనలను అధికారులు అమలుచేయుటకు అవకాశాలు కలవు సంతోషంగా గడుపుతారు. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుతారు, నూతనంగా చేపట్టిన ప్రయత్నాలు అనుకూలిస్థాయి. భోజనం విషయంలో ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తారు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంభంలోమాత్రం తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థికంగా లాభాలను కలిగిఉంటారు నూతనవస్థువులను కొనుటకు ఇష్టపడుతారు కొద్దిపాటి ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. దూరప్రదేశ ప్రయాణాల గురుంచి నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా కొంత ఒత్తడికి గురయ్యే అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి  : ఈ రాశివారికి ఈవారం మిశ్రమఫలితాలను పొందుతారు. కుటుంభంలో వివాదములు కలుగుటకు ఆస్కారం కలదు. సేవాగుణాన్ని కలిగిఉండటంచేత తోటివారిలో గౌరవాభివృద్దిని పొందుటకు అవకాశం కలదు. ఒకవార్త మీలోకొంత నిరుత్సహంను భాదను పెంచుతాయి మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి. మీయొక్క కోపంమీకు ఇబ్బందులను తెచ్చుటకు అవకాశంఉంది కావున జాగ్రత్తగా ఉండటంమేలు. విందులు వినొదములపట్ల ఆసక్తినిప్రదర్శిస్తారు బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. నూతన నిర్ణయాలు తీసుకొనే విషయంలో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట ఉత్తమం. సమయపాలన మేలుచేస్తుంది.  

 

మకర రాశి  : ఈ రాశివారు ప్రారంభంలో చేపట్టినపనులను అనుకున్నసమయానికి పూర్తిచేస్తారు బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు. భోజనసౌఖ్యంను పొందుతారు ఆర్థికంగాలాభంను పొందుటకు అవకాశం కలదు. వారంచివార్లో ఆరంభించే పనులను వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది.  చేయువృత్తియందు చిక్కులు ఏర్పడుటకు అవకాశంఉంది.ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట మేలు, అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సర్దుకుపోవడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించుట మేలు విలువైన వస్థువులపట్ల అప్రమత్తత అవసరం. నూతన గృహనిర్మానంపైన ఇష్టాన్ని కలిగిఉంటారు.  

 

కుంభ రాశి : ఈ రాశివారికి కొంత అనుకూలమైన సమయం చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. బంధువులతో సరదాగా సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన వ్యక్తులతో మీయొక్క ప్రణాలికలను సిద్దంచేస్తారు.కాకపోతే మీయొక్క మాటతీరు కొంతమందిని ఇబ్బందిపెట్టే అవకాశం కలదు కావున జాగ్రత్తవహిచండి. మీయొక్క గురువుల ఆలోచనలను పాటించుట చేత ముందుకు వెళ్తారు. భాద్యతలు పెరుగుతాయి, వాటికి తగినట్లుగా ప్రణాళిక సిద్దం చేసుకోవడం మంచిది. సోదరులతో చేసిన చర్చలు మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాయి.

 

మీన రాశి :  ఈరాశివారికి ఈవారం పెద్దగా అనుకూలమైన ఫలితాలు లేనప్పటికిని పెద్దగ ఇబ్బందులు కూడా పడరు. వ్యాపారంలో మాత్రం నూతన ఆలోచనలు చేయకండి. ఖర్చులు పెరుగుతాయి ధననష్టం పొందుతారు కావునజాగ్రత్త అవసరం .ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో సమయాన్ని కేటాయిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి, కొత్త ఉద్యోగాలు లభించే ఆస్కారం కలదు. మీయొక్క వ్యతిరేకులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలనే ప్రయత్నం మిమ్మల్ని కొంతమేర భాధకు గురిచేస్తుంది. కుటుంబసభ్యుల నుండి నూతన సూచనలు వస్తాయి , వాటిగురుంచి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. కొంత కోపాన్ని తగ్గించుకోవడం సూచన.

మరిన్ని శీర్షికలు
sahiteevanam