Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deepika in hollywood

ఈ సంచికలో >> సినిమా >>

మణి శర్మ సీడీని దొంగతనం చేశా: నాని

nani stolen maniratnam C.D

మణి శర్మ పాటలంటే చెవి కోసుకోని వారుండరు. అలాగే మన యంగ్‌ హీరో నానికి కూడా చిన్నప్పట్నుంచీ మణిరత్నం మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే తన చిన్నప్పుడు సీడీ షాపులో మణిరత్నం సీడీని దొంగతనం చేశాడట. ఆ మెమరీని 'జెంటిల్‌ మెన్‌' ఆడియో ఫంక్షన్‌లో సరదాగా అందరితో పంచుకున్నాడు నాని. ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాని కొత్త చిత్రం 'జెంటిల్‌ మెన్‌'. ఈ సినిమాకు మణిరత్నం మ్యూజిక్‌ అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు నాని. ఈ సినిమాలో సురభి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని తొలి సినిమా 'అష్టా చెమ్మా'ను సింపుల్‌గా, డిఫరెంట్‌గా తెరకెక్కించి అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న డైరెక్టర్‌ ఇంద్రగంటి. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో రాబోతున్న 'జెంటిల్‌మెన్‌' సినిమాలో నానిని డిఫరెంట్‌ లుక్‌లో ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నాడు డైరెక్టర్‌. ఈ సినిమాలో నాని పోజిటివ్‌, నెగిటివ్‌ రోల్స్‌తో మెప్పిస్తాడట. అసలు నాని హీరోనా?, విలనా? అనే సస్పెన్స్‌తో సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంటుందట. ఈ సస్పెన్స్‌కు తెర లేపాలంటే జూన్‌ 17 వరకూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆ సినిమా విడుదలయ్యేది అప్పుడే మరి ! 

మరిన్ని సినిమా కబుర్లు
sunil re entry with megastar movie