Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nani stolen maniratnam C.D

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తాడా?

sunil re entry with megastar movie

హీరో అయ్యాక కమెడియన్‌గా నటించడం తగ్గించేశాడు సునీల్‌. ఏదో త్రివిక్రమ్‌తో స్నేహం నేపథ్యంలో 'ఖలేజా' సినిమాలో కాస్సేపు కనిపించాడు కమెడియన్‌గా సునీల్‌. ఆ తరువాత సునీల్‌ కమెడియన్‌గా చేయబోతున్నది చిరంజీవి సినిమాలోనేనట. చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ చిత్రంలో సునీల్‌, కమెడియన్‌గా కనిపించనున్నాడని సమాచారమ్‌. చిరంజీవిని మనసారా అన్నయ్య అని పిలిచే సినీ ప్రముఖుల్లో సునీల్‌ అందరికన్నా ముందుంటాడు. సునీల్‌ డాన్సులేస్తోంటే తెరపై అచ్చంగా చిరంజీవిని చూస్తున్నట్లే ఉంటుంది. సునీల్‌ కమెడియన్‌ అయ్యాక, చిరంజీవి హీరోగా వచ్చిన చాలా సినిమాల్లో సునీల్‌ నటించాడు. 'ఠాగర్‌' సినిమాలో కడుపుబ్బా నవ్వించిన సునీల్‌, 'స్టాలిన్‌' సినిమాలో నవ్వించడంతోపాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ నటించి మెప్పించాడు. తమిళ సినిమా 'కత్తి' రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్నారనగానే సునీల్‌ ఎగిరి గంతేశాడట. తనంతట తానే చిరంజీవి వద్దకు వెళ్ళి, సినిమాలో ఛాన్స్‌ ఇవ్వాల్సిందిగా అడిగాడట. చిరంజీవి అంటే అంత అభిమానం సునీల్‌కి. 'కత్తి' రీమేక్‌పై ఎన్నెన్నో అంచనాలున్నాయి. ఆ సినిమాల్లో చాలా చాలా విశేషాలు కూడా ఉన్నాయి. అందులో కమెడియన్‌గా సునీల్‌ నటించడం ఇంకో పెద్ద విశేషంగా చెప్పవచ్చు. 
 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam