Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chaitu as comming class look

ఈ సంచికలో >> సినిమా >>

పూరి - కళ్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్‌ సూపర్బ్‌

puri - kalyan ram first look superb

పూరీ జగన్నాధ్‌, కళ్యాణ్‌రామ్‌ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ న్యూలుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. కళ్లజోడు, డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో ఉన్న కళ్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్‌ను తాజాగా పూరీ జగన్నాధ్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశాడు. ఏ హీరోనైనా లుక్స్‌, బాడీలాంగ్వేజ్‌ పరంగా డిఫరెంట్‌గా చూపించడం పూరీ జగన్నాధ్‌ ప్రత్యేకత. 'పోకిరి' సినిమాలో మహేష్‌ను కొత్తగా చూపించి ఆకట్టుకునేలా చేశాడు. తాజాగా 'టెంపర్‌' సినిమాతో ఎన్టీఆర్‌లోని విశ్వరూపాన్ని చూపించి, భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే మరో నందమూరి హీరోతో సినిమా చేస్తున్నాడు పూరి.

ఈ సినిమాతో హీరో లుక్స్‌లో డిఫరెన్స్‌ చూపించడమే కాకుండా సినిమా కూడా చాలా డిఫరెంట్‌గా తెరకెక్కించబోతున్నాడట పూరీ. కళ్యాణ్‌రామ్‌కి సంబంధించినంతవరకు ఇది చాలా చాలా డిఫరెంట్‌ లుక్‌ అనే భావన అభిమానుల్లో వినవస్తోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో అదితి ఆర్య అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. పూరి సినిమాల్లో హీరోకి డిఫరెంట్‌ మేనరిజం ఉంటుంది. ఒక్కసారి పూరి డైరెక్షన్‌లో సినిమా చేశాడో, ఆ తర్వాత ఆ హీరో బాడీ లాంగ్వేజ్‌ పూర్తిగా మారిపోతుంది. ఫ్రీ స్టయిల్‌లోకి మారిపోతారు హీరోలు. కళ్యాణ్‌రామ్‌లో కూడా ఆ స్టయిల్‌ కనిపించనుందట. 

మరిన్ని సినిమా కబుర్లు
did maruti got promotion