Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
puri - kalyan ram first look superb

ఈ సంచికలో >> సినిమా >>

డైరెక్టర్‌ మారుతికి ప్రమోషన్‌ వచ్చిందా

did maruti got promotion

చిన్న హీరోలతో సినిమాలు చేసే డైరెక్టర్‌ మారుతి సడెన్‌గా వెంకటేష్‌లాంటి పెద్ద హీరోతో సినిమా చెయ్యడం అంటే చాలా గొప్ప విషయం అని టాలీవుడ్‌లో టాక్‌. ఆయనకి ఈ అదృష్టం తెచ్చిపెట్టింది నానితో చేసిన 'భలే భలే మగాడివోయ్‌' సినిమా భారీ విజయాన్ని సాధించి పెట్టడమే అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా విజయంతోనే మారుతి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే విక్టరీ వెంకటేష్‌తో సినిమాకు కమిట్‌ అయ్యాడు. 'బాబు బంగారం' టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా తెరక్కెబోతోంది.

ఒక పాట, ఫైట్‌ మినహా దాదాపుగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్‌ 6న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. ఇదే నెలలో ఆడియో కూడా విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో అందాలతార నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కాకుండా, మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌కు మారుతి ఒక కథ విన్పించినట్లు తాజా సమాచారమ్‌. ఆ కథను సాయిధరమ్‌ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అంటే త్వరలోనే మెగా కాంపౌండ్‌లో కూడా ఈ డైరెక్టర్‌ సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలకు ప్రమోట్‌ అయిన మారుతి, భవిష్యత్తులో స్టార్‌ డైరెక్టర్‌ అనిపించుకోనున్నాడనడం నిస్సందేహం. 

మరిన్ని సినిమా కబుర్లు
nikhil as comming more trill