Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
did maruti got promotion

ఈ సంచికలో >> సినిమా >>

మళ్ళీ థ్రిల్‌ చేస్తానంటున్న యంగ్‌ హీరో నిఖిల్‌

nikhil as comming more trill

నిఖిల్‌ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా?'. ఈ సినిమాలో నిఖిల్‌ నటన, స్టైలింగ్‌ అన్నీ డిఫరెంట్‌గా ఉండబోతున్నాయట. సినిమా సినిమాకీ డిఫరెంట్‌ లుక్‌నీ, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌నీ మెయిన్‌టెయిన్‌ చేస్తున్న నిఖిల్‌ ఈ సినిమా కోసం కూడా చాలా కష్టపడ్డాడని సమాచారమ్‌. లుక్స్‌, బాడీలాంగ్వేజ్‌ పరంగా చాలా కేర్‌ తీసుకున్నాడట నిఖిల్‌. మేఘన ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, నందితా శ్వేతా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీని కూడా జత చేసి సింపుల్‌గా ఆట్రాక్టివ్‌గా ఈ సినిమాను తెరకెక్కించారట. 'శంకరాభరణం' పరాజయం తర్వాత వస్తున్న ఈ సినిమా నిఖిల్‌కు కొంత మేర ఉపశమనం అవుతుందని ఆశిస్తున్నాడు నిఖిల్‌.

ఇంతవరకూ వచ్చిన హారర్‌ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా స్టోరీ ఉండబోతోందట. చూస్తున్న ప్రేక్షకుడు థ్రిల్‌కి గురవుతూనే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్‌ చేసే విధంగా ఉంటుందట సినిమా. నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. నిఖిల్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. దాదాపుగా సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల కానుంది. ఆగష్టులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
beauty with bodybiluder