Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nikhil as comming more trill

ఈ సంచికలో >> సినిమా >>

బ్యూటీతో కండలవీరుడి కుస్తీ

beauty with bodybiluder

'పీకే' సినిమాతో ఘనవిజయం అందుకున్న ముద్దుగుమ్మ అనుష్క శర్మ. ఈ ముద్దుగుమ్మకు అందంతో పాటు కూసింత మంచి తనం కూడా ఎక్కువే. తనకేదనిపిస్తే అది సూటిగా చెప్పెయ్యడం ఈ ముద్దుగుమ్మకి అలవాటు. దాంతో మొదట్లో చాలా ప్రోబ్లమ్స్‌ ఫేస్‌ చేశానంటోంది అనుష్క బ్యూటీ. కానీ అలాగని తన వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం మార్చుకోనని కూడా సూటిగా చెప్పేస్తోంది. తాజాగా ఈ భామ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో 'సుల్తాన్‌' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మల్లయుద్ధం నేర్పించే శిక్షకురాలి పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ పాత్ర కోసం మల్లయుద్ధంలో మెలకువలు నేర్చుకోవడం కోసం ప్రత్యేకించి శిక్షణ తీసుకుందట అనుష్క.

సినిమాలో సల్మాన్‌కు ఇంచుమించు సమానంగా తన పాత్ర ఉండబోతోందని అంటోంది అనుష్క. సీనియర్‌ హీరో అయినప్పటికీ సల్మాన్‌లో ఏ మాత్రం గర్వం ఉండదనీ, తన తోటి నటీనటులతో చాలా గౌరవంగా, హుందాతనంగా సల్మాన్‌ మెలగుతాడనీ అందుకే ఆయన అంత పెద్ద స్టార్‌ అయ్యాడనీ, సల్మాన్‌ని ఆకాశానికెత్తేస్తోంది అనుష్క. కండలు తిరిగిన శరీరంతో సల్మాన్‌ఖాన్‌ ఓ పక్క, గ్లామరస్‌ బ్యూటీ అనుష్క తన స్లిమ్‌ ఫిజిక్‌తో ఇంకోపక్క 'సుల్తాన్‌' సినిమాలో నటించి ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ ఈద్‌కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈద్‌కి సల్మాన్‌ చేసిన సినిమాలన్నీ సంచలన విజయాలు సాధించాయి. 'సుల్తాన్‌' కూడా ఆ స్థాయి విజయం సాధిస్తుందేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddaam