Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jagapati babu act in 4  languages

ఈ సంచికలో >> సినిమా >>

సమంత ఒంటరిగా అస్సలుండలేదంట

samanata can't live alone

చిలిపిగా, చలాకీగా కనిపించే ముద్దుగుమ్మ సమంత. క్యూట్‌ క్యూట్‌గా ఎక్కడ చూసినా అల్లరి పిల్లలా నవ్వుతూ కనిపిస్తుంది. ఆమె నవ్వే ఆమెకు అందం. అదృష్టం. ఈ ముద్దుగుమ్మకి చుట్లూ నలుగురు ఉండడమంటేనే ఎప్పుడూ ఇష్టమట. ఒంటరితనం అస్సలు భరించలేనంటుంది. అందుకే షూటింగ్‌ సమయంలో సెట్స్‌లో ఉన్నప్పుడూ కూడా నలుగురూ గుమిగూడి ఉన్న చోటే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుందట. ఎంత అలిసిపోయినా ఒంటరిగా రెస్ట్‌ తీసుకుందాం అని అనుకోదట. ఎప్పుడైనా తన చుట్టూ నలుగురు జనం లేకపోతే ట్విట్టర్‌లో అందర్నీ పలకరిస్తుందట.

అందుకే తనకు చాలా మంది స్నేహితులు, సిన్నిహితులు ఉన్నారని అంటోంది ముద్దుగుమ్మ సమంత. ఆ చలాకీతనం, ఆనందంగా అందరితో గడపడమే తనకు సక్సెస్‌ని తెచ్చిపెట్టాయంటోంది. దేవుని ముందు నిలబడి తనను ఏం వరం కావాలంటే ఎప్పుడూ నవ్వుతూ నలుగురితో కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటా అని నవ్వుతూ చెప్పేస్తోంది ముద్దుగుమ్మ సమంత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'అ,ఆ..' సినిమాతో సాధించిన విజయానికి ఎవరినోట విన్నా ఆమె మాటే. సమంత ది గ్రేట్‌ అంంటూ.. పొగిడేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆమె సినిమాల్లో 'బ్రహ్మూెత్సవం' నిరాశపరిచినా, 'అ,ఆ..' అంతకుమించిన బూస్టప్‌నిచ్చింది. త్వరలోనే మళ్లీ ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' సినిమాతో మన ముందుకు రాబోతోంది స్మైలీ బ్యూటీ సమంత. 

మరిన్ని సినిమా కబుర్లు
janata garriage on speed