Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
samanata can't live alone

ఈ సంచికలో >> సినిమా >>

జోరు మీదున్న 'జనతా గ్యారేజ్‌'

janata garriage on speed

'మిర్చి', శ్రీమంతుడు' సినిమాలతో సెన్సేషన్‌ సృష్టించిన డైరెక్టర్‌ కొరటాల శివ. మాస్‌ సినిమాలకు సెన్సేషన్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌. మరి ఈ ఇద్దరు మనసు పెడితే వచ్చేది ఖచ్చితంగా సెన్సేషల్‌ మూవీనే కదా. అలాంటి సెన్సేషన్‌కు తెర లేవనుంది ఇప్పుడు 'జనతా గ్యారేజ్‌' సినిమాతో. కొరటాల డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'జనతాగ్యారేజ్‌'. సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'నాన్నకు ప్రేమతో' సినిమాతో హిట్‌ అందుకున్న యన్టీఆర్‌, 'అ,ఆ..' సినిమాతో బిగ్గిస్ట్‌ హిట్‌ అందుకున్న సమంత కాంబినేసన్లో ఈ సినిమా మరో హిట్‌ అవ్వడం పక్కా అని చిత్ర యూనిట్‌ నమ్మకంగా ఉంది. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో క్లాస్‌ అండ్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి తన లుక్‌లోని కొత్త యాంగిల్‌ను పరిచయం చేశాడు ఎన్టీఆర్‌. 'టెంపర్‌'తో మరో రకం విశ్వరూపం చూపించాడు.

ఈ సారి ఫుల్‌ మాస్‌ లుక్‌తో వస్తానంటున్నాడు. మాస్‌ అప్పీలే కాకుండా పాటల్లో కూడా ఫుల్‌ జోష్‌గా ఉండబోతున్నాడట ఎన్టీఆర్‌ ఈ సినిమాలో. జోరుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకి విడుదల చేసేలా డైరెక్టర్‌ కొరటాల ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. సమంతతో పాటు నేచురల్‌ బ్యూటీ నిత్యామీనన్‌ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
balayya pair settled