Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సందీప్ కిషన్ తో ఇంటర్వ్యూ

interview with sandeep kishan

హీరో అయ్యింది కోట్లు కూడ‌బెట్ట‌డానికి కాదు - సందీప్ కిష‌న్‌

ఈ త‌రం క‌థానాయ‌కుల ఆలోచ‌నా ధోర‌ణి మారింది. కొడితే వంద‌మంది ప‌డిపోయే మాస్ క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం లేదు. క‌థ‌కీ, కాన్సెప్ట్‌కీ ప‌ట్టం క‌డుతున్నారు. ఆ దారిలోనే విజ‌యాలూ అందుకొంటున్నారు. `కొత్త సినిమా` చూసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. సందీప్ కిష‌న్ కూడా ఆ టైపు క‌థానాయ‌కుడే. త‌న పాత్ర‌కంటే క‌థ‌కి, పారితోషికం కంటే పాత్ర‌కీ ప్రాధాన్యం ఇచ్చే క‌థానాయ‌కుడు. ఇప్పుడు ఒక్క అమ్మాయి త‌ప్ప అంటూ మ‌రోసారి ఓ డిఫ‌రెంట్ క‌థ‌తో అల‌రించ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. ఆ సంద‌ర్భంగా సందీప్‌తో చిట్ చాట్ ఇది..

* ఒక్క అమ్మాయి త‌ప్ప‌.. ఎవ‌రా అమ్మాయి?
- ఇంకెవ‌రండీ.. నిత్య‌మీన‌న్‌..

* ఆవిడ‌కీ మీకూ లింకేంటి?
- ఇద్ద‌రి లింకూ... ఓ ట్రాఫిక్ జామ్‌!  అక్క‌డే ఇద్ద‌రికీ ప‌రిచ‌యం. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిందా, లేదా?  అన్న‌ది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది.

* నిత్య‌మీన‌న్ సినిమా అంటే ఆవిడ‌దే డామినేష‌న్ అంటారు క‌దా.. ఈ సినిమాలో కూడా..
- అబ్బే అలాంటిదేం లేదండీ. ల‌క్కీగా నా పాత్ర కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. బేసిగ్గా హీరో, హీరోయిన్ల క్యారెక్ట‌ర్లు స‌మానంగా ఉన్న‌ప్పుడు ఆవిడ త‌న టాలెంట్‌తో డామినేట్ చేసేస్తుంది. ఈ సినిమాలో నా పాత్ర‌కు వెయిట్ ఎక్కువ‌. అందుకే ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు.

* మీరు ఫ్రీగా ఈ సినిమా చేశార్ట‌..
- అవునండీ. మంచి క‌థ‌లు వ‌చ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు త‌ప్ప‌వు. నేను ఇండ్ర‌స్ట్రీలోకి వ‌చ్చింది కోట్లు సంపాదించ‌డానికి కాదు. మంచి సినిమాలు తీయ‌డానికి. ఈ సినిమా ద్వారా నిర్మాత‌కు లాభాలొస్తే.. అప్పుడు నా డ‌బ్బులు నేను తీసుకొంటా.

* నిత్య కూడా సినిమాలో వాటా అడిగిందా?
- అదేం లేదండీ.. కాక‌పోతే ఈ సినిమా కోసం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకొంది. అంత‌కు మించి మ‌నీ విష‌యాల్లో నేను ఇన్వాల్వ్ కాను.

* ఈ సినిమాకి మీ చోటా మామా హెల్ప్ ఎంత వ‌ర‌కూ..?
- ఈ సినిమాకి కెమెరామెన్‌గా చోటా మామానే కావాల‌ని ద‌ర్శ‌కుడు అడిగాడు. ఇలాంటి సినిమాని ఆయ‌న బాగా హెల్ప్ అవుతార‌నిపించింది.. అందుకే ఆయ‌నొచ్చారు. నేనూ చోటా మామ క‌లసి చేసిన సినిమాల‌న్నీ బాగా ఆడాయి. అందుకే ఈ సినిమాపైనా నాకు గ‌ట్టి న‌మ్మ‌కం.

*  మీరూ.. చోటా మామా క‌ల‌సి క‌థ‌లో మార్పులు, చేర్పులూ చేస్తుంటారా?
- అబ్బే లేదండీ. నేను క‌థ లోనూ డైరెక్ష‌న్ లోనూ వేలు పెడితే.. సుబ్రంగా అదే చేసుకొంటాను క‌దా. నాకు తెలియ‌ని విష‌యాల్లో ఇన్వాల్వ్ అవ్వ‌ను.

* ర‌న్ స‌మ‌యంలో కూడా మీరు బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.  ఆ సినిమా ఫెయిల్ అవ్వ‌డానికి కార‌ణం ఏమిటి?
- నిజం చెప్పాలంటే ర‌న్ సినిమా నాకే న‌చ్చ‌లేదు. ఆసినిమాని మేం అనుకొన్న‌ది అనుకొన్న‌ట్టుగా తీయ‌లేక‌పోయాం. సినిమా చూశాక‌.. అరె ఇన్ని త‌ప్పులు చేశామేంటి?  అనిపించింది. ఒక్క అమ్మాయి త‌ప్ప అలా కాదు. ఎప్పుడో సిద్ద‌మైంది. ఇప్ప‌టికి ఒక‌టికి నాలుగు సార్లు చూసుకొని, అన్ని విధాలా హ్యాపీ అనుకొన్నాకే విడుద‌ల చేస్తున్నాం.

* కృష్ణ‌వంశీ సినిమాలో హీరో అయిపోయారు..
- అవునండీ.. ఓ క‌ల నిజ‌మైంది. కృష్ణ‌వంశీగారికి నేను వీరాభిమానిని. ఆరేళ్ల క్రితం ఆయ‌న‌కు ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ పెట్టా. సార్ మిమ్మ‌ల్ని క‌ల‌వాల‌ని ఉంది.. ఒక్క‌సారి హాయ్ చెప్పే అవ‌కాశం ఇవ్వండి.. అంటూ సందేశం పంపా. ఇప్పుడు ఆయ‌న‌తోనే సినిమా చేయ‌డం.. ఓ క‌ల‌లా ఉంది.

* ఇన్నేళ్ల కెరీర్‌లో ఏం నేర్చుకొన్నారు?
- ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆరేళ్ల‌య్యింది. సినిమాపైరోజు రోజుకీ ప్రేమ పెరుగుతూ వ‌స్తోంది. సందీప్ కిష‌న్ అన‌గానే ఈడేదో డిఫ‌రెంట్ గా ట్రై చేయాల‌నుకొంటాడు... అన్న‌దైతే జ‌నంలోకి వెళ్లింది. దాన్ని కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటా. ఓ మంచి క‌థ వ‌చ్చిన‌ప్పుడు దాని కోసం ఏమైనా చేయాల‌నిపిస్తుంది. నిజాయ‌తీగా ప‌నిచేస్తే ఈ సినిమా త‌ప్పు చేయ‌దు అనుకొన్న‌ప్పుడు ఏం చేయ‌డానికికైనా వెనుకాడ‌ను.   కృష్ణ‌వంశీ సినిమాలో హీరోయిన్ నందిత అంటున్నారు..- ఇంకా ఏం అనుకోలేదండీ.. అవ‌న్నీ ఆయ‌నే చూసుకొంటారు..

* ఇంతకీ మీ జీవితంలో ఆ ఒక్క అమ్మాయి ఎవ‌రూ..?
- నిజంగానే ఎవరూ లేరండీ బాబు.. ఉంటే బాగుణ్ణు...ఈ సినిమాల టెన్ష‌న్ల నుంచి కాస్త‌యినా రిలీఫ్ దొరుకుతుంది.

* చేస్తున్న సినిమాలేంటి?
- త‌మిళంలో రెండు సినిమాలు చేశా. అవి తెలుగులో అనువాదాల రూపంలో విడుద‌ల‌వుతాయి. ప్ర‌స్తుతానికి కృష్ణ‌వంశీగారి సినిమాపైనే ఫోక‌స్‌. అది పూర్త‌య్యే వ‌ర‌కూ ఏ సినిమా ఒప్పుకోకూడ‌దు అనుకొంటున్నా..

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
jagapati babu act in 4  languages