Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
visheshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చిన్న చేపల పులుసు - -బన్ను

కావలిసినపదార్ధాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం ,వెల్లుల్లి  , చింతపండు

తయారుచేసే విధానం: ముందుగా  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర,  వెల్లుల్లి వీటన్నింటినీ గ్రైండ్ చేసి వుంచాలి. తరువాత మందపాటి గిన్నెలో నూనె వేసి ఆ నూనె వేడెక్కాక గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి తరువాత ఉప్పును,  చిన్న చేపలను కూడా వేసి గరిటెతో కలపకుండా మెల్లగా అటు ఇటు కదిలించాలి. తరువాత పసుపు, కారం వేసి చింతపండు పులుసును వేసి 10 నిముషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేయాలి.   అంతే వేడి వేడి చిన్నచేపల పులుసు రెడీ...! 

మరిన్ని శీర్షికలు