Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

రైట్ రైట్ చిత్ర సమీక్ష

movie revie right right

చిత్రం: రైట్‌ రైట్‌ 
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, ప్రభాకర్‌, పూజా జవేరి, రాజా రవీంద్ర, సుధ, నాజర్‌, తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌, ధన్‌రాజ్‌, జయవాణి, పావని గంగిరెడ్డి, వినోద్‌ కిషన్‌ తదితరులు. 
సంగీతం: జెబి 
ఛాయాగ్రహణం: శేఖర్‌ వి జోసెఫ్‌ 
దర్శకత్వం: మను 
నిర్మాతలు: జె. వంశీకష్ణ 
నిర్మాణం: శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 10 జూన్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

మధ్య తరగతి యువకుడైన రవి (సుమంత్‌ అశ్విన్‌) తనకు ఇష్టం లేపోయినా, కుటుంబం కోసం ఆర్టీసీలో బస్‌ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. రెండు పల్లెటూళ్ళ మధ్య తిరిగే ఒకే ఒక్క బస్సుకి రవి కండక్టర్‌ అయితే, శేషు (ప్రభాకర్‌) డ్రైవర్‌. ఒకే ఒక్క బస్సు కావడంతో, బస్సు ప్రయాణీకులకి, బస్సు గమ్యస్థానం చేరే గవిటి గ్రామంలోనివారికీ వీరిద్దరూ దగ్గరవుతారు. అనుకోకుండా రవి, శేషు కారణంగా ఓ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంతో వీరిద్దరి జీవితాల్లో బీభత్సమైన టర్నింగ్‌ పాయింట్‌ ఎదురవుతుంది. అదేంటి? అసలు ఆ ప్రమాదానికి వీరెలా కారకులయ్యారు? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

సుమంత్‌ అశ్విన్‌ మంచి నటుడు. అతని నటనా ప్రతిభను ఇప్పటికే అతను నటించిన పలు చిత్రాలతో అంతా గుర్తించారు. అతని కళ్ళలో ఓ నిజాయితీతో కూడిన అమాయకత్వం కన్పిస్తుంది. చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఈ సినిమాలోనూ అంతే. హావభావాల్ని అద్భుతంగా పలికించాడు. సరదా సరదాగా సాగే సన్నివేశాల్లోనూ, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు.

ప్రభాకర్‌ అంటే 'బాహుబలి'లోని కాలకేయ పాత్ర గుర్తుకు వస్తుంది. చాలా సినిమాల్లో అతి క్రూరుడిగా కనిపించాడతడు. కానీ, ఇందులో భిన్నమైన పాత్ర పోషించాడు. తన నటనతో మెప్పించాడు. ఈ సినిమాతో ప్రభాకర్‌కి సరికొత్త గుర్తింపు లభిస్తుంది. హీరోయిన్‌ పూజా జవేరి ఓకే. తన పాత్ర వరకూ న్యాయం చేసింది. పూజా గంగిరెడ్డి బాగా చేసింది. భద్ర పాత్రలో నటించిన వినోద్‌ కిషన్‌ ఆకట్టుకున్నాడు. సీనియర్‌ నటుడు నాజర్‌ తనదైన నటనతో తన ప్రెజెన్స్‌ని చాటుకున్నాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 
కథ ఓకే. ఇది రీమేక్‌ సినిమా గనుక, కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథనం కూడా అంతే. అయితే నేటివిటీకి తగ్గట్టుగా సినిమాని నడిపించడంలో దర్శకుడు కొంతమేర సఫలమయ్యాడు. డైలాగులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. సంగీతం బాగుంది. అక్కడక్కడా ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. చిన్న సినిమా అనే భావన రాకుండా నిర్మాత సినిమాని రిచ్‌గా వచ్చేందుకు సహకరించారు.

ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంటుంది. సెకెండాఫ్‌లో ట్విస్ట్‌లు, ఎమోషనల్‌ సీన్స్‌తో కాస్సేపు స్పీడ్‌గా కాస్సేపు స్లోగా అనిపిస్తుంటుంది. ఓవరాల్‌గా సినిమా ఓకే. ఇంటర్వెల్‌ బ్లాక్‌, క్లయిమాక్స్‌ ఆకట్టుకుంటాయి. సరదాగా కమర్షియల్‌ లవ్‌ స్టోరీస్‌ చేసుకుంటూ వెళ్ళాల్సిన వయసులో, ప్రయోగాత్మక చిత్రాల వైపు తన దృష్టిని మరల్చినందుకు హీరో సుమంత్‌ అశ్విన్‌ని అభినందించాలి. అలాగే, మంచి ప్రయత్నం చేసినందుకు దర్శకుడ్ని, నిర్మాతని అభినందించకుండా ఉండలేం. ఓల్డ్‌ ఫ్లేవర్‌ని తగ్గించగలిగితే, సినిమా చాలా ఫ్రెష్‌గా, అందర్నీ అలరించేలా ఉండేది. ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
రైట్‌ రైట్‌.. జర్నీ ఓకే

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు