Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

జెంటిల్ మెన్ చిత్రసమీక్ష

jentle men movie review

చిత్రం: జెంటిల్‌మెన్‌ 
తారాగణం: నాని, సురభి, నివేదితా థామస్‌, శ్రీనివాస్‌ అవసరాల, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, ఆనంద్‌, తనికెళ్ళ భరణి, రోహిణి, ప్రగతి, రమాప్రభ తదితరులు 
సంగీతం: మణిశర్మ 
ఛాయాగ్రహణం: పిజి విందా 
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి 
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్‌ 
నిర్మాణం: శ్రీదేవి మూవీస్‌ 
విడుదల తేదీ: 17 జూన్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

తొలి చూపులోనే కేథరీన్‌ (నివేదితా థామస్‌) ప్రేమలలో పడతాడు గౌతమ్‌ (నాని). ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళిన కేథరీన్‌, తిరిగొస్తుండగా ఆమెకు ప్రయాణంలో ఐశ్వర్య (సురభి) పరిచయమవుతుంది. ఇద్దరూ తమ ప్రేమ గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో వారిద్దరికీ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. ఇద్దరూ తాము ప్రేమించింది అతన్నేనంటారు. కానీ అతను ఒక్కడు కాదు, ఇద్దరన్న విషయం తెలుస్తుంది. ఇద్దరేనా? ఒక్కరా? అన్న కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతుంది. అసలేంటి ఈ కన్‌ఫ్యూజన్‌ అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

నటుడిగా నానిలో వంకపెట్టడానికేమీ దొరకదు. ఏ పాత్ర ఇచ్చినా సరే జీవించేస్తాడతడు. నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, రొమాన్స్‌లో ఇరగదీసేస్తాడు. అన్ని హావభావాల్నీ పలికించడంలో నాని దిట్ట. ఈ సినిమాలో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రల్ని అవలీలగా డీల్‌ చేసేశాడు. నటించడం కాదు రెండు పాత్రల్లోనూ జీవించేశాడు. సరదాగా ఉండే పాత్రలో, రిజర్వ్‌డ్‌గా ఉండే పాత్రలో నటించి మెప్పించాడు. రెండు పాత్రల్లోని వేరియేషన్స్‌నీ బాగా చూపించాడు.

హీరోయిన్లలో నివేదితా థామస్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. బాగా నటించిందామె. మరో హీరోయిన్‌ సురభికి గ్లామర్‌ తప్ప, పెద్దగా ఆమెకు నటించడానికేమీ లేదు. నటన పరంగా ఆమెకు పెద్దగా మార్కులు పడవు. జర్నలిస్టు పాత్రలో శ్రీముఖి బాగా చేసింది. వెన్నెల కిషోర్‌ బాగా నవ్వించాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.

కథ మరీ కొత్తది కాకపోయినా కథనం పరంగా ఆసక్తి రేకెత్తించగలిగాడు దర్శకుడు. సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ, రివీల్‌ చేస్తూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించాడు. కథనం చాలా బాగుంది. అయితే ఫస్టాఫ్‌లో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఎడిటింగ్‌ ఫస్టాఫ్‌లో ఇంకా అవసరం అనిపిస్తుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి.

ఫస్టాఫ్‌ స్లోగా అనిపిస్తుంది. సరదా సరదాగా సాగిపోయినా, స్పీడ్‌ మాత్రం కనిపించదు. కాస్త బోర్‌ ఫీలవ్వాల్సి వస్తుంది. సెకెండాఫ్‌లో కథ వేగం పుంజుకుంటుంది. కథలో ఆడియన్స్‌ లీనమయ్యేలా చేస్తుంది. ఒక్కరా? ఇద్దరా? ఒక్కరేనేమో, కాదు ఇద్దరుంటారేమో అనే కన్‌ఫ్యూజన్‌ని దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. దర్శకుడి పనితనానికి నటుడి నటనా ప్రతిభ తోడైతే సినిమా ఇంకో లెవల్‌కి వెళుతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ని దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. హీరో దానికి పూర్తి న్యాయం చేశాడు. ఓవరాల్‌గా ఓ డిఫరెంట్‌ అటెంప్ట్‌ అనిపిస్తుంది. రొటీన్‌కి భిన్నంగా సినిమాలు ఎంచుకుంటున్న నాని ఈ సినిమాతో ఇంకో మెట్టు పైకెక్కాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. క్లాస్‌, మాస్‌ ఆడియన్స్‌ని అలరించే చిత్రమిది. సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌, సినిమాకి చేసిన పబ్లిసిటీ అన్నీ కలిసొచ్చి ఓపెనింగ్స్‌ రాబట్టుకున్నట్లే, వసూళ్ళనూ బాగా రాబట్టుకునే ఛాన్సుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
పైసా వసూల్‌ జెంటిల్‌మెన్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka