Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nani

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్‌ రిలీజ్‌కు రెడీ

NTR janata garage ready for release

నిన్న క్లాస్‌లుక్‌లో 'నాన్నకు ప్రేమతో' అంటూ వచ్చి క్లాస్‌ సినిమాల్లో ఒకటి తన కెరీర్‌లో వేసుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇప్పుడు ఫుల్‌ మాస్‌ హీరోగా 'జనతా గ్యారేజ్‌' సినిమాతో రాబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కబోతోన్న ఈ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ చిత్రం. రెండు పాటలు మినహా దాదాపుగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తవనుంది. ఈ సినిమాలో మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో మోహన్‌లాల్‌కీ, ఎన్టీఆర్‌కీ మధ్య సీన్స్‌ చాలా హైలైట్‌గా నిలుస్తాయట.

అంతేకాదు తొలిసారిగా మోహన్‌లాల్‌ ఈ సినిమాలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నాడని సమాచారం. అవకాశం వస్తే ఇకపై కంటిన్యూస్‌గా తెలుగు సినిమాల్లో నటిస్తానని చెబుతున్నాడు మళయాళ హ్యాండ్‌సమ్‌ మోహన్‌లాల్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా సమంత నటిస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పోజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంటోంది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'జనతా గ్యారేజ్‌' ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడును అనే టైటిల్‌తోనే ఫ్యాన్స్‌ని సగం దోచేశాడు ఎన్టీఆర్‌. 'నాన్నకు ప్రేమతో' సినిమాకి హత్తుకునే మ్యూజిక్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ మరోసారి ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించాడు. ఈ సినిమాకి ఆయన అందించిన మాస్‌ బాణీలు ఆకట్టుకునే విధంగా ఉంటాయట. టోటల్‌గా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
pavan hand power