Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega prince with malayalam beauty

ఈ సంచికలో >> సినిమా >>

చిరంజీవితో 'ఢీ'కొట్టనున్న రాజశేఖర్‌

chiru vs rajashekar

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సినిమా. 'కత్తి' తమిళ సినిమాకి తెలుగు రీమేక్‌. 'కత్తిలాంటోడు' అనుకుంటున్నారు. వినాయక్‌ దర్శకత్వం. ఈ సినిమా కోసం రాజశేఖర్‌ విలన్‌గా మారతాడట. కెరీర్‌ తొలినాళ్ళలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటించిన రాజశేఖర్‌. చిరంజీవితో నటించాలనే బలమైన కోరిక ఆయనకు ఉంది. చిరంజీవి కోసమే విలన్‌గా మారతానని ప్రకటించిన రాజశేఖర్‌. వినాయక్‌, చిరంజీవి ముందు ఇదే ప్రతిపాదన పెట్టాడట. చిరంజీవికి ధీటైన ప్రత్యర్థి అవుతాడనే అంచనా. తెలుగులో ఇప్పటికే జగపతిబాబు విలనిజం పండిస్తున్నాడు. రాజశేఖర్‌ విలనిజం కన్‌ఫామ్‌ అయితే తెలుగు తెరపై ఆసక్తికరమైన కాంబినేషన్‌ అవుతుంది.

తెలుగు తెరకు సూపర్బ్‌ విలన్‌ కూడా దొరికనట్లవుతుంది. ఇప్పటికే రాజశేఖర్‌ విలన్‌గా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఒక సినిమా కన్‌ఫామ్‌ అయ్యింది. ఈ సినిమాలో గోపీచరద్‌ హీరోగా నటిస్తున్నాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా టైం ఉంది. ఈ లోపల 'కత్తి' రీమేక్‌లో నటించాలనుకుంటున్నాడు. విలన్‌గా రీ ఎంట్రీలో మొదట చిరంజీవితోనే చెయ్యాలన్న రాజశేఖర్‌ కోరికి కూడా తీరుతుంది దీనితో. మరి రాజశేఖర్‌ ప్రొపోజల్‌ తొలుత చిరంజీవి సినిమా ప్రొడ్సూసర్‌ అయిన చరణ్‌దాకా వెళ్లాలి. చరణ్‌ ఓకే చెయ్యాలి. అప్పుడు గానీ ఈ విషయంపై క్లారిటీ రాదు. ఏదేమైనా చిరంజీవితో కలిసి నటించాలనే రాజశేఖర్‌ ఆటిట్యూడ్‌ హర్షించదగ్గదే. ఆల్‌ ది బెస్ట్‌ టు రాజశేఖర్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
nagasourya  likes anushka