Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru vs rajashekar

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్క జపం చేస్తున్న నాగశౌర్య

nagasourya  likes anushka

హీరోలకి హీరోయిన్లతో ఎఫైర్లంటూ గాసిప్స్‌ రావడం సహజం. వాటిని స్పోర్టివ్‌గా తీసుకోవాలి. కాని యంగ్‌ జనరేషన్‌కి ఇది ఇబ్బందిగా మారింది. నాగశౌర్యకు మెగా హీరోయిన్‌ నిహారికతో లవ్‌ ట్రాక్‌ నడుస్తోందనే గాసిప్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'ఒక మనసు' సినిమా కోసం ఈ యంగ్‌ పెయిర్‌ ఇద్దరూ కొంచెం దగ్గరగా మూవ్‌ అవుతున్న మాట నిజమే. కానీ అదంతా కేవలం సినిమా కోసమే తప్ప. మా మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదు. ఓన్లీ ఫ్రెండ్‌షిప్‌ తప్ప అంటున్నాడు నాగశౌర్య. పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారికతో నటించడం అంటే మొదట నాకు కొంచెం భయమేసింది కానీ ఆమె మాత్రం మెగాఫ్యామిలీ నుండి వచ్చిన గర్వం ఎక్కడా చూపించకుండా నన్ను చాలా బాగా ట్రీట్‌ చేసింది నిజంగా నిహారిక చాలా గొప్ప స్నేహితురాలు అంటునానడు యంగ్‌ హీరో. కానీ తనపై వచ్చిన ఈ గాసిప్స్‌కి వెంటనే ఈ యంగ్‌ హీరో అలర్ట్‌ అయ్యాడు. సీరియస్‌గా స్పందిస్తూనే స్పోర్టివ్‌గా సమాధానమిచ్చాడు.

అందాల భామ అనుష్క అంటే తనకి చాలా ఇష్టమనీ, కావాలంటే ఆమెతో ఎఫైర్‌ ఉందనీ రాయమన్నాడు. నాగశౌర్య స్పాంటేనిటీ అందరికీ నచ్చింది. హీరోలకి ఈ గాసిప్స్‌ సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. స్పోర్టివ్‌గా తీసుకుంటే ఏమీ ఉండదు. సీరియస్‌గా స్పందిస్తే కెరీర్‌కి ఇబ్బంది. స్పందించకపోయినా సమస్యే. నాగశౌర్య చాలా తెలివైనోడే. అందుకే, కరెక్ట్‌ టైంకి కరెక్ట్‌గా స్పందించి ఈ సమస్య నుండి ఈజీగా బయటపడ్డాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam