Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
oka manasu movie review

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ రెడీ.. స్టార్ట్‌ యాక్షన్‌ కెమెరా

mega star ready.. start action camera

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఎన్నాళ్ళుగానో అభిమానులు ఎదురుచూసిన సందర్భం రానే వచ్చింది. మెగాస్టార్‌ సూపర్‌ స్లిమ్‌ లుక్‌తో అదరగొట్టేశారు. డైరెక్టర్‌ వినాయక్‌, మెగాస్టార్‌ని ఆ లుక్‌లో సెట్‌లో చూసి మురిసిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఠాగూర్‌' సినిమా మెసేజ్‌ ఓరియెంట్‌డ్‌ మూవీల్లో టాప్‌ లెవల్లో నిలిచి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టింది. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా కూడా 'ఠాగూర్‌'లా మంచి మెసేజ్‌తో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కానుందని అంచనా. ఈ సినిమాకు రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి హీరోయిన్‌ ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు.

షూటింగ్‌ మొదలు పెట్టిన నాటి నుండీ శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేస్తారు. సినిమాలో డాన్సులూ, యాక్షన్స్‌ ఇరగదీయడానికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో చిరంజీవి ఉన్నారట. ఠాగూర్‌ తరహాలో చిరంజీవి కోసం పవర్‌ఫుల్‌ డైలాగులు ప్రిపేర్‌ చేశారు. మెగా అభిమానుల్ని ఆశక్తికి గురి చేసే డైలాగ్స్‌ని పరుచూరి బ్రదర్స్‌ రచించారు. తమ కలానికి పదును పెట్టి, 'ఠాగూర్‌'ని మించిన విజయం అందించాలనే కసితో ఉన్నారు. మొత్తానికి అనుకున్న విధంగానే చిరంజీవి సినిమాకి కంటెంట్‌ అంతా ప్రిపేర్‌ అయిపోయింది. ఒక్క హీరోయిన్‌ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ సినిమాకి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేసినట్లే. హీరోయిన్‌ పేరు కూడా ఖరారయ్యిందనీ అయితే ఆ విషయాన్ని ఇప్పటికి గోప్యంగా ఉంచుతున్నారనీ సమాచారమ్‌. ఏదేమైనా మెగాస్టార్‌ చిరంజీవి రంగంలోకి దూకేసినట్లే. బాక్సాఫీస్‌ రికార్డులకు మూడినట్లే. 

మరిన్ని సినిమా కబుర్లు
nagarjuna ready to act ragavendra rao direction