Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagarjuna ready to act ragavendra rao direction

ఈ సంచికలో >> సినిమా >>

చెల్లిపాత్రలు చెయ్యనంటే ఎలా?

sister role can not  act says chandini choudary

సినీ రంగంలో ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. 'బ్రహ్మూెత్సవం' సినిమాలో మహేష్‌కి చెల్లెలిగా నటించింది చాందిని చౌదరి. ఈ భామ 'కుందనపు బొమ్మ' సినిమాతో హీరోయిన్‌ అయ్యింది. ఇకపై చెల్లి పాత్రలు చెయ్యనని ఖరాఖండీగా చెబుతుంది చాందిని. ఒకవేళ చెల్లి పాత్రలు చేస్తే హీరోయిన్‌గా అవకాశాలు రావేమోనని ఈ ముద్దుగుమ్మకి భయం కావొచ్చు. కానీ మారుతున్న ట్రెండ్‌లో ఏ పాత్ర ప్రాధాన్యత ఆ పాత్రదే. స్టార్‌ హీరోయిన్‌ అయిన అనుష్కనే చిన్న చిన్న పాత్రల్లోనూ నటించడానికి ఒప్పుకుంటోంది. షార్ట్‌ ఫిలింస్‌ నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ భామ. అచ్చమైన తెలుగమ్మాయి.

కానీ మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పెద్దగా సక్సెస్‌ అయ్యింది లేదు. అందుకే తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో ప్రోత్సాహమిచ్చి ఆదరణ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. హీరోయిన్‌గా మంచి అవకాశం వస్తే తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ నటిస్తానంటోంది. కానీ హీరోయిన్‌గా మాత్రమేనంట. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారి సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చినాక నటిగా నిరూపించుకోవడానికి అవకాశమున్న ఏ పాత్రలోనైనా నటిస్తానని చెప్పాలి. ఆయా పాత్రల ద్వారా ఆమె నటన నచ్చి మెచ్చి ఏ అవకాశం ఇవ్వాలో దర్శక నిర్మాతలు నిర్ణయించాలి. అంతేకానీ పలానా పాత్ర చెయ్యను ఫలానా పాత్రలు మాత్రమే చేస్తానని భీష్మించుకుని కూర్చుంటే అసలు అవకాశాలు ఎలా వస్తాయమ్మా ముద్దుగుమ్మ. ముందుగా ఈ వాస్తవం నువ్వు తెలుసుకోవమ్మా కుందనపు బొమ్మా! 
 

మరిన్ని సినిమా కబుర్లు
satakarni  in battle