Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sister role can not  act says chandini choudary

ఈ సంచికలో >> సినిమా >>

యుద్ధంలో మునిగి తేలుతున్న శాతకర్ణి

satakarni  in battle

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలకృష్ణ సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. ఈ సినిమా బాలయ్యకు 100వ చిత్రం కావడంతో చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు బాలయ్య ఈ సినిమాని. షూటింగ్‌ పనులు వేగవంతం ఆయ్యాయి. హైదరాబాదు శివార్లలో వేసిన భారీ సెట్‌లో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు క్రిష్‌. ఇప్పటికే మొరకోలో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న శాతకర్ణి టీం త్వరలో జార్ఖండ్‌ వెళ్లనుంది. అక్కడ చారిత్రక కట్టడాల్లో కొన్ని రోజులు షూటింగ్‌ చేసుకోనుంది.

కొన్ని పాటలు కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట క్రిష్‌ బృందం. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ముద్దుగుమ్మ శ్రియ కొంచెం ఒళ్లు చేసి బొద్దుగా ముస్తాబయ్యింది. ఈమె పాత్ర సినిమాకు చాలా కీలకం. అందుకే గౌతమీ పుత్ర శాతకర్ణి భార్యగా నటిస్తోన్న శ్రియ తన పాత్ర కోసం చాలా కసరత్తులే చేసిందట. ఆమె నుంచి ఔట్‌ పుట్‌ బాగా వస్తోందని ఇప్పటికే సెట్‌లో ప్రశంసలు అందుకుంటోంది ముద్దుగుమ్మ శ్రియ. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి హేమామాలిని కూడా కీలకపాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందిస్తున్న మెలోడీ మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు దేవి. బాలకృష్ణ కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్‌ సినిమా కానుంది. ఈ సినిమాతోనే తన కొడుకు మోక్షజ్ఞ కూడా సినీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. తమ అభిమాన హీరో వారసుడ్ని తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ సినిమాలో మరి. 

మరిన్ని సినిమా కబుర్లు
burning star hearted....