Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
burning star hearted....

ఈ సంచికలో >> సినిమా >>

నిహారిక కు శుభాభినందనలు

niharika grand entry

నిహారిక.....అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి..అంతేన, అటు అల్లు వారింటి నుంచీ, ఇటు కొణిదెల వారింటి నుంచీ తెరపైకొచ్చిన మొట్టమొదటి ముద్దుగుమ్మ. మెగా ఫామిలీ నుంచి తెరంగేట్రం చేసేవారెవ్వరి పైన అయినా ప్రేక్షకులకు భారీ అంచనాలు, ప్రత్యేకాసక్తీ ఉంటాయి. అందునా కథానాయిక అంటే ఇక చెప్పేదేముంది?

అందాల రాణిగా వెలుగొందిన ఐశ్వర్య రాయ్ బాలి వుడ్ ని ఓ ఊపు ఊపి బచ్చన్ ల వారింట్ మెట్టి, ఐశ్వర్య బచ్చన్ గా మారినా తెరపై మెరుపులు కురిపిస్తూనే ఉంది.. కపూర్ ల ఫ్యామిలీ నుంచి కరిష్మా, కరీనాలు కథా నాయికలుగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసారు. చారుహాసన్ కుమార్తె సుహాసిని , కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ కేవలం అందాల ఆరబోతకే పరిమితం కాకుండా తమ నటనా ప్రతిభతో తెలుగు, తమిళ చిత్రసీమలో రాణిస్తున్నారు. ఇక మన టాలివుడ్ విషయానికొస్తే గతంలో ఆకినేని వారింటి నుంచి అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పరిచయమైన సుప్రియ ఆ తర్వాత కెమెరా ముందు కనిపించడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు..

ప్రస్తుతం ఒక మనసు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నిహారిక నటిగా చక్కటి పరిణితి ప్రదర్శించిందని ఇప్పటికే టాక్ వచ్చేసింది. అంతకు ముందే కొన్ని యూట్యూబ్ సీరియల్స్ లోనూ నటించి కొన్ని చిన్నా పెద్దా చానెల్స్ లో యాంకరింగ్ కూడా చేసి అందరితోనూ ఔరా అనిపించుకున్న నిహారికకు సరికొత్త సంకేతికతపై పైన చక్కటి అవగాహన ఉంది. వెబ్ వారపత్రికలలో సంచలనం సృష్టించిన గోతెలుగు పై ఎంతో అభిమానంతో ప్రచార చిత్రం లో పాల్గొనడం ఇందుకు నిదర్శనం. అందం- అభినయం సాంకేతికతపై అవగాహన కలిగిన ఈ మల్టీ టాలెంటెడ్  మెగా హీరోయిన్ అనేక విజయాలు తన సొంతం చేసుకోవాలనీ, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకోవాలనీ కోరుకుంటూ, ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తోంది గోతెలుగు...

 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam