Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

చిత్రం: రోజులు మారాయి 
తారాగణం: చేతన్‌, పార్వతీశం, కృతిక, తేజస్వి తదితరులు 
సంగీతం: జెబి 
సమర్పణ: దిల్‌ రాజు 
దర్శకత్వం: మురళీకృష్ణ 
కథ, స్క్రీన్‌ప్లే: మారుతి 
నిర్మాత: జి. శ్రీనివాస్‌రావు 
నిర్మాణం: మారుతి టాకీస్‌, వెంకటేశ్వర క్రియేషన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌ 
విడుదల తేదీ: 01 జులై 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
ఆద్య (కృతిక), రంభ (తేజస్వి) లైఫ్‌ని సరదాగా ఎంజాయ్‌ చేసే ఇద్దరమ్మాయిలు. అబ్బాయిలతో టైమ్‌పాస్‌ చేయడం వీరికి అదో సరదా. తమ అవసరాల కోసం అశ్వద్‌ (చేతన్‌), పీటర్‌ (పార్వతీశం)లను వాడుకుంటుంటారు ఈ ఇద్దరమ్మాయిలు. ఓ బాబా, ఈ అమ్మాయిలకి ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్తాడు. అదేంటంటే, ఎవర్నయితే ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారో, పెళ్ళి చేసుకున్న కొద్ది రోజులకే వారు చనిపోతారని. దాంతో, ఆ చనిపోయేదేదో ఈ తింగరోళ్ళే అయితే బాగుంటుందని స్కెచ్చేస్తారు ఆద్య, రంభ. కానీ ఈ తింగరోళ్ళు మాత్రం సీరియస్‌గా ఆ అమ్మాయిల్ని ప్రేమించేస్తుంటారు. ఆ తర్వాత ఏమవుతుందన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
రంభ పాత్రలో తేజస్వి చాలా ఈజ్‌ ప్రదర్శించింది. ఇలాంటి పాత్రలు తేజస్వికి కొట్టిన పిండి. గ్లామరస్‌గానూ కనిపించింది. కృతిక కూడా ఫర్వాలేదు. తేజస్వితో పోల్చితే కృతిక ఎనర్జీ పరంగా కాస్త డల్‌ అయ్యింది. ఓవరాల్‌గా ఓకే. హీరోల్లో పార్వతీశం, చేతన్‌ని ఓవర్‌టేక్‌ చేసేశాడు. తెరపై పార్వతీశం కనిపిస్తున్నంతసేపూ సందడిగా ఉంటుంది. చేతన్‌ కూడా బాగానే చేశాడు. డిఫరెంట్‌ స్లాంగ్‌తో పార్వతీశం సినిమాని వన్‌ మాన్‌ షో అనిపించేశాడనటం అతిశయోక్తి కాదు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. 
చాలా సినిమాల్లో వచ్చేసిన కథే ఇది. అయితే దీన్ని యూత్‌ ఫుల్‌ కథగా మార్చేయడం కొత్తదనం అనుకోవాలి. ఆద్యంతం ఎంటర్‌టైన్‌నీ, కాస్త థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌నీ మిక్స్‌ చేయడం మరో కొత్తదనం. డైలాగ్స్‌ బాగున్నాయి. కథనం కూడా బాగుంది. యూత్‌ ఫుల్‌ మూవీస్‌కి రొమాంటిక్‌ టచ్‌ ఇవ్వడం, థ్రిల్లింగ్‌ టచ్‌ ఇవ్వడంలో మారుతి దిట్ట. ఆ మార్కు ఈ సినిమాలోనూ కనిపించింది. ఎడిటింగ్‌ ఓకే. అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి, నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా పనిచేశాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. సినిమాకి రిచ్‌నెస్‌ని అద్దారు.

ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. కాస్త లవ్‌, కాస్త రొమాన్స్‌, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా సాగిపోతుంటుంది ఫస్టాఫ్‌. ఇంటర్వెల్ట్‌ బ్యాంగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లో సినిమా థ్రిల్లింగ్‌ వైపు మళ్ళుతుంది. థ్రిల్లర్‌ టర్న్‌ తీసుకున్నాక, సినిమాలో వేగం తగ్గినట్లనిపిస్తుంది. ఓవరాల్‌గా యూత్‌కి నచ్చేలా సినిమా తీయగలిగారనే చెప్పొచ్చు. కామెడీనీ, థ్రిల్లర్‌నీ ఆడియన్స్‌ మెచ్చేలా తీయడంలో 'ప్రేమకథా చిత్రం' సక్సెస్‌ అయ్యింది. ఆ స్థాయిలో కథ నడపడం కుదరలేదిక్కడ. టార్గెట్‌ ఆడియన్స్‌ యూత్‌ని కొంతమేర ఎట్రాక్ట్‌ చేసేలానే ఉంది. తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమా కావడం, మారుతి బ్రాండ్‌కి దిల్‌ రాజు హ్యాండ్‌ తోవడంతో పబ్లిసిటీ అదిరిపోయింది. ఇవన్నీ ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. ఓవరాల్‌గా పైసా వసూల్‌ చిత్రం

ఒక్క మాటలో చెప్పాలంటే 
రోజులు మారాయి కామెడీ నుంచి థ్రిల్లర్‌కి 
అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka