Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sushaant act atadukundam raa movie

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ మెగా సెన్సేషన్‌

megastar mega sensetion

మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు తెరపై రెండు దశాబ్దాలపాటు ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల వెండితెరకు దూరమైన చిరంజీవి, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు అప్పుడప్పుడూ సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తూ వచ్చారు. నిరీక్షణకు తెరపడి, చిరంజీవి షూటింగ్‌కి హాజరువుతున్నారు. తమిళ సినిమా 'కత్తి'ని వినాయక్‌, తెలుగులోకి రీమేక్‌ చేస్తుండగా, ఆ చిత్రంలో నటిస్తున్న చిరంజీవి, ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మునుపటిలా తెరపై జోష్‌తో కూడిన లుక్‌తో కనిపించేందుకు బాగా సన్నబడ్డమే కాకుండా, డాన్సుల్లోనూ మునుపటి వేగం చూపించేందుకు డాన్స్‌ ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నట్లు సమాచారమ్‌. ఇప్పటివరకు అందుతున్న సమాచారం కోసం సినిమాలో చిరంజీవి రెండు లేదా మూడు గెటప్స్‌లో కనిపించవచ్చునని తెలియవస్తోంది.

తమిళ వెర్షన్‌కి చాలా మార్పులు చేశారట, తెలుగు నేటివిటీ కోసం. హీరోయిన్‌ ఎవరన్నది ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, ఓ అగ్రహీరోయిన్‌తో సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. సినిమా ఫస్ట్‌ లుక్‌ని వచ్చే నెలలో విడుదల చేస్తారట. చిరంజీవి పుట్టినరోజు నాటికి టీజర్‌ రిలీజ్‌ చేయాలని చిరంజీవి తనయుడు, ఈ సినిమా నిర్మాత రామ్‌చరణ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారమ్‌. అప్పటినుంచే మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌ని కూడా అమలు చేస్తారట. మెగాస్టార్‌ రీ ఎంట్రీ మూవీ కోసం పరుచూరి సోదరులు తమ కలం పదును చూపించబోతున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam