Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
iliyana has changed

ఈ సంచికలో >> సినిమా >>

అల్లరోడి జోరు బాగా పెరిగింది

allarodu on speed

తాజాగా 25 చిత్రాలు పూర్తి చేసుకున్న అల్లరి నరేష్‌ కెరీర్‌ ఈ మధ్య కొంచెం స్లో అయిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అల్లరోడు జోరు పెంచాడు. సినిమాలు ఫెయిలైనా, తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇదివరకటిలా గ్యాప్‌ తీసకోకుండా, ఇకపై వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ, ప్రేక్షకులతో టచ్‌లో ఉండాలనుకుంటున్నాడు.

అందులో భాగంగానే క్షణం తీరిక లేకుండా కథల మీద కథలు వింటున్నాడు. వినడమే కాదు ఏకంగా రెండు స్టోరీలు లైన్‌లో పెట్టేశాడు కూడా. ఆల్రెడీ నరేష్‌ హీరోగా వస్తున్న 'సెల్ఫీ రాజా' షూటింగ్‌ జరుపుకుంటోంది. మరో పక్క జి. నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను ఒప్పుకున్నాడు నరేష్‌. ఈ సినిమా హారర్‌ కామెడీ నేపధ్యంలో ఉండబోతోందట. ఈ సినిమాలో కృత్తిక అనే కొత్త హీరోయిన్‌ తెరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా వచ్చేనెల 23 నుండి సెట్స్‌ మీదికెళ్లనుంది. మరో పక్క కృష్ణ భగవాన్‌ తెచ్చిన మరో కథకు ఓకే చెప్పాడు. అనీష్‌ కృష్ణ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో మునుపటి నరేష్‌ని చూడొచ్చని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీతో ఆధ్యంతం వినోదంగా సాగిపోయే చిత్రమిది. కృష్ణ భగవాన్‌ రాసిన పంచ్‌ డైలాగులు అదిరిపోయేలా ఉన్నాయంటున్నారు. ఈ సినిమా సెప్టెంబరులో పట్టాలెక్కనుంది. మొత్తానికి అల్లరి నరేష్‌ మూడు పక్కల మూడు సినిమాలతో సెట్స్‌లో అల్లరల్లరి చేయనున్నాడన్న మాట. 

మరిన్ని సినిమా కబుర్లు
sushaant act atadukundam raa movie