Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
allarodu on speed

ఈ సంచికలో >> సినిమా >>

సుశాంత్‌ 'ఆటాడుకుందాం రా' అంటున్నాడు

sushaant act atadukundam raa movie

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్‌ హీరో సుశాంత్‌. 'కరెంట్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. కానీ ఒక్క సినిమా చెప్పుకోదగ్గదిగా లేదు సుశాంత్‌ కెరీర్‌లో. ప్రస్తుతం జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వలో తెరకెక్కుతోన్న 'ఆటాడుకుందాం రా' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు సుశాంత్‌. చింతలపూడి శ్రీనివాస్‌రావు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోనమ్‌ బజ్వా హీరోయిన్‌గ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీఫిల్మ్‌ సిటీలో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో సుశాంత్‌ న్యూలుక్‌లో కనిపిస్తాడట. ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుశాంత్‌ మెచ్చూర్డ్‌గా కనిపిస్తాడట.

సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది.నటనలోనూ, డాన్సుల్లోనూ అదరగొట్టేసే ఈ అక్కినేని మేనల్లుడు నటనలో మంచి ఈజ్‌ ఉన్నప్పటికీ సక్సెస్‌ ఇంకా దరి చేరడం లేదు. ఈ సినిమాతో మాంచి జోష్‌గా మన ఆటేసుకుంటానంటున్నాడు. చూద్దాం ఈ సినిమా అయినా సుశాంత్‌కి సక్సెస్‌ తెచ్చిపెడుతుందో లేదో. అక్కినేని మేనల్లుడు సుమంత్‌ కూడా ఒకటీ అరా సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నటుడిగా పూర్తిగా సక్సెస్‌ కాలేకపోయాడు. దాంతో నిర్మాణం వైపు దృష్టి పెట్టి, మెల్లగా ట్రాక్‌ మార్చేశాడు. మరి సుశాంత్‌కైనా హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకొనే అవశాశం లభిస్తుందో లేదో చూద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
megastar mega sensetion