Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

యజ్ఞం మొదలు పెట్టిన దర్శకేంద్రుడు

namo venkateshaya shooting started

సినిమా తెరకెక్కించడమంటే ఆషామాషీ కాదు. సినిమాని యజ్ఞంలా భావించే దర్శకులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైనవారిలో మళ్ళీ దర్శకేంద్రుడిది ప్రత్యేకమైన స్థానం. అందుకే ఆయన దర్శకేంద్రుడయ్యారు. కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఎన్నో ప్రశంసలు అందుకున్న దర్శకేంద్రుడు, విలక్షణ చిత్రాలు తీయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. దర్శకేంద్రుడి నుంచి ఈ మధ్య చాలా చాలా ప్రత్యేకమైన చిత్రాలొస్తున్నాయి. 'అన్నమయ్య' చేసినా, 'శ్రీరామదాసు' చేసినా అది ఆయనకే చెల్లింది. 'ఓం నమో వెంకటేశాయ' సినిమా తెరకెక్కిస్తున్న దర్శకేంద్రుడు, భక్తిరస చిత్రం కావడంతో తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చేశారు, గెటప్‌లోనూ మార్పు చేసుకున్నారు. తానే కాదు, యూనిట్‌ సభ్యులెవరూ సెట్స్‌లో చెప్పులు వేసుకుని తిరగడలేదట. నిలువు బొట్టు, తెల్ల జుబ్బాని డ్రెస్‌ కోడ్‌లా మార్చేశారు.

హైదరాబాద్‌లో దేవాలయం సెట్‌ని వేసి అందులో చిత్రీకరణ చేస్తుండగా, షూటింగ్‌ కోసం దర్శకేంద్రుడు తీసుకుంటున్న చర్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అనుష్క ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఆమెది భక్తురాలి పాత్ర. సన్యాసినిగా కనిపించనుందామె. నాగార్జున హతీరాంబాబాగా కనిపిస్తారు. ఆధ్యాత్మిక అద్భుతంగా భవిష్యత్‌ తరాలు చర్చించుకునేలా ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రం కోసం నాగార్జున ఎన్నో కసరత్తులు చేయాల్సి వచ్చింది. భక్తుడి పాత్రలు నాగార్జునకి కొత్తేమీకాదు. 'అన్నమయ్య' సినిమాలో ఆయన తప్ప ఇంకెవర్నీ ఊహించుకోలేం అనేంతలా నటించి మెప్పించారాయన. ఏదేమైనా దర్శకేంద్రుడి 'నమో వెంకటేశాయ' అనే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో పాల్గొంటుండడం అభినందనీయం. 

మరిన్ని సినిమా కబుర్లు
megastar movie is going on