Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar movie is going on

ఈ సంచికలో >> సినిమా >>

'వైశాఖం'లో అన్నీ ఉంటాయ్‌: జయ

every thing is vaishakam

మహిళా దర్శకురాలు జయ, 'చంటిగాడు', 'లవ్‌లీ' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు, సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏదో ఒక సినిమా చేసెయ్యడం కాకుండా, నచ్చిన కథతో ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా కోసం టైమ్‌ తీసుకుంటున్నారామె. కాస్త గ్యాప్‌ తీసుకుని ఆమె రూపొందిస్తున్న సినిమా 'వైశాఖం'. ఈ సినిమాలో కొత్త జంట కనిపించనుంది. హరీష్‌, అవంతిక ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వినోదభరితమైన కుటుంబ కథా చిత్రాలకు ఇటీవలి కాలంలో మంచి ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో 'వైశాఖం' సినిమాని కూడా ఆ జోనర్‌లోనే రూపొందిస్తున్నారట. ప్రేమకథకు కుటుంబ విలువలు జోడించి, అందర్నీ అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకురాలు జయ చెప్పారు. చిన్న సినిమాల్లో తమది పెద్ద సినిమా అంటున్న జయ, కమర్షియల్‌గా అన్ని అంశాలూ ఉండేలా చూసుకుంటూనే సినిమాతో మంచి మెసేజ్‌ నేటి యువతరానికి ఇవ్వాలనే ఆలోచనతో సినిమాని రూపిందించినట్లు పేర్కొన్నారు. పరిమిత బడ్జెట్‌లో టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో సినిమా ఉంటుందట. తెరపై సినిమాని చూసే ప్రేక్షకుడు మంచి సినిమాని చూశామనే భావనకు లోనవుతారట. కొత్త జంట హరీష్‌, అవంతిక తెరపై ఫ్రెష్‌ లుక్‌తో కనిపిస్తారట. అపార్ట్‌మెంట్‌ నేపథ్యంలో సాగే ఈ కథ అందర్నీ అలరిస్తుందనే నమ్మకం తమకుందని జయ చెప్పారు. 

మరిన్ని సినిమా కబుర్లు
every thing is in abhinetri