Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
every thing is in abhinetri

ఈ సంచికలో >> సినిమా >>

'జనతాగ్యారేజ్‌' ఓపినింగ్‌కి టైం వచ్చేసింది

its time to janata garriage

కొరటాల శివ దర్శకత్వంలో యన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'జనతా గ్యారేజ్‌'. ఇక్కడ అన్నీ రిపేర్‌ చేయబడును అనేది ఉపశీర్షిక. రంజాన్‌ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. బరువైన డైలాగులతో బలా బలాలు తేల్చుకోవడానికి రెఢీ అయిపోయాడు ఎన్టీఆర్‌. 'నాన్నకు ప్రేమతో' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు మరో సూపర్‌ హిట్‌కి కాలు దువ్వుతున్నాడు. బలహీనుడికి కూడా బలం ఉంటుంది. అదే జనతాగ్యారేజ్‌ అంటూ చాలా బలమైన డైలాగులున్న టీజర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. పక్కా మాస్‌ లుక్‌లో ఎన్టీఆర్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. ఇందులో ఎన్టీయార్‌ ఐఐటి స్టూడెంట్‌గా కనిపిస్తాడట.

ఐఐటి స్టూడెంట్‌కీ, జనతా గ్యారేజ్‌కీ లింకేంటో తెరపైనే చూడాలి. కొరటాల శివ సినిమాల్లో హీరో చాలా ఎడ్యుకేటెడ్‌ అయి ఉండి, ఇంటెలిజెంట్‌గా వ్యవహరిస్తూనే కండల బలం కూడా చూపిస్తాడు. ఎన్టీఆర్‌ పాత్ర కూడా అలానే ఉండనుంది ఈ చిత్రంలో. మళయాళ్‌ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. టీజర్‌లో ఈ ఇద్దరి లుక్స్‌తో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌, సక్సెస్‌ఫుల్‌ కాస్టింగ్‌తో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల మందుకు రానున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పతాక సన్నివేశాలను హైదరాబాద్‌లో భారీ సెట్టింగుల మధ్య చిత్రీకరిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. సినిమాను ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు తీనుకురానున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
guntur takies hero with cinima soopista mava producer