Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
guntur takies hero with cinima soopista mava producer

ఈ సంచికలో >> సినిమా >>

పేద విద్యార్థులకు ఒక మనసు చిత్ర బృందం చేయూత

okamanasu unti helps to poor students

TV 9 సమర్పణలో, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని విజయపధంలో దూసుకుపోతుంది. మనసుకు హత్తుకునే ఇలాంటి హృద్యమైన ప్రేమకధలు తెలుగులో చాలా అరుదుగా వస్తాయని విమర్శకులు సైతం ఒక మనసు చిత్రాన్ని కొనియాడారు. ఇది ఇలా వుండగా thegreatfan.com వెబ్ సైట్ లో చిత్ర బృందం నిర్వహించిన హీరో హీరోయిన్ల కాస్ట్యూమ్స్ వేలంపాటకి మంచి స్పందన లభించింది. ఈ వేలంపాట ద్వారా వచ్చిన నగదుతో చిత్ర బృందం, గచ్చిబౌలిలోని చావడి పేద విద్యార్థుల ఆశ్రమంలో పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మరియు పాద రక్షలు పంచిపెట్టారు. సమాజం పై తమవంతు భాధ్యతగా ఈ కార్యక్రమ౦ నిర్వహించినందుకు చాలా ఆనందంగా వుందని, ఈ సందర్భంగా ఒక మనసు చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam