Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందం - చందం - మానస

 

మోచేతుల నలుపుదనం... ముఖం మీద నల్లటి మచ్చలు తగ్గాలంటే..?!!
 
మోచేతుల నలుపుదనం తగ్గాలంటే... 
చేతులను పెసరపిండితో రుద్ది నీటితో శుభ్రపరుచుకోవాలి. తరవాత రెండు టీ స్పూన్ల కమలాపండు రసాన్ని తీసుకుని మోచేతులకు పట్టించి చేతివేళ్లతో 20 నిమిషాలపాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇప్పుడు శుభ్రపరచిన చేతులకు అయిదారు చుక్కల బాదం ఆయిల్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే మోచేతుల నలుపు తగ్గి చేతులు ఆకర్షణీయంగా ఉంటాయి.
 
అరటిపండు ఫేస్ ప్యాక్...

అరటిపండుని మెత్తగా పేస్ట్ చేసి అందులో అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ బాదం ఆయిల్, అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం పొడిబారడం, నల్ల మచ్చలు తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది.
 

మరిన్ని శీర్షికలు
Hepatitis c | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)