Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of himalayas

ఈ సంచికలో >> శీర్షికలు >>

15-07-2016 నుండి 21-07-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో మీ ఆలోచనల మూలాన మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీ యొక్క మాటతీరు మూలాన నష్టపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది,కాకపోతే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన సమాచరం అందుతుంది గతకొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిఅవుతాయి.  

 

 

వృషభ రాశి ఈవారం మొత్తంమీద అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విలువైన వస్తువుల విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు చేపట్టండి వాటిని కోల్పోయే అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయల్లో మాత్రం పెట్టుబడులకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయకండి ఒకవేళ చేయవలసి వస్తే తగిన ఏర్పాట్లు చేసుకోవడం మేలు. మిత్రుల నుండి వచ్చు సూచనల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట,అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.    

                       

మిథున రాశి :   ఈవారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులను పొందినను ప్రణాళికా బద్దంగా ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. కుటుంబంలో పెద్దల నుండి వచ్చు సూచనల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం పెట్టుబడులు పెట్టునపుడు నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో పనిఒత్తిడి తప్పకపోవచును అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన పనులు పూర్తిఅయ్యేఅవకాశం ఉంది. పెద్దలతో చర్చల్లో పాల్గొంటారు.  

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. నచ్చిన వారితో కలిసి సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. సోదరవర్గంతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది కావున  విషయంలో మాత్రం బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు. వ్యాపారపరమైన విషయాల్లో తాత్కాలిక ప్రయోజనాలకన్నా దీర్గకాలిక ప్రయోజనాలకు ప్రముక్యతను ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది కాకపోతే అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్దతీసుకోవడం ఉత్తమం. 

 

           
సింహ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల్లో అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో నలుగురితో కలిసి మీయొక్క ఆలోచనలను పంచుకుంటారు కాస్త సమయం ఇవ్వడం వలన వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. అధికారులతో కలిసి ప్రయాణాలు అలాగే చర్చలు జరుపుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేపట్టుటకు ఇష్టపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ధనం అవసరానికి చేతికి అందుతుంది. కుటుంబంలో శుభకార్యములకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. విదేశీప్రయత్నాలు ఆరంభిస్తారు కొంత సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మిత్రుల నుండి సహకారం లభించుట వలన మేలుజరుగుతుంది.    

 

కన్యా రాశి :  ఈవారం మొత్తంమీద ఒకవార్త మిమ్మల్ని కొంత నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. అనుభవజ్ఞులతో కలిసి పనులను చేపట్టుట మంచిది. ముందుచూపు అవసరం తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు వస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది కాకపోతే సమయనికి వాటిని పూర్తిచేస్తారు. విందులలో పాల్గొంటారు అలాగే నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని కొంత భాధకు గురిచేస్తుంది జాగ్రత్త.  

 

 

   

తులా రాశి : ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమాయనికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేపట్టుటకు అవకాశం కలదు. స్త్రీ పరమైన విషయాలకు ఖర్చులు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యుల నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం కలదు. అధికారులనుండి మంచి గుర్తింపును పొందుతారు మీ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది సమాయనికి భోజనం చేయుట సూచన. పనిఒత్తిడి తప్పక పోవచ్చును ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. 

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద పెద్దల సూచనలు,సలహాలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు అవతలివారి అభిప్రయాలను తెలుసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన ఆశించిన విధంగా ఉంటుంది. తలపెట్టిన పనులను విజయవ్నతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు అగ్నిసంభందమైన పనులను చేసే సమయంలో జాగ్రత్తలు పాటించుట మంచిది.  

 

 

ధనస్సు రాశి  :  ఈవారం మొత్తంమీద స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళితే విజయాలను సాధించే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు ఆరంభించే అవకాశం కలదు. తలపెట్టిన పనులను ఇతరుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని మొండినిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది కాకపోతే నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఆలోచన చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటికి సమయం ఇస్తారు. కుటుంబంలో సభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. విదేశీప్రయత్నాల విషయంలో అనుభవజ్ఞుల సూచనలతో ముందుకు వెళితే మేలుజరుగుతుంది.  

 

మకర రాశి  :  ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది ఆదాయంకు తగ్గటుగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పనిభారం తప్పక పోవచ్చును సమయపాలన అవసరం. నలుగురిలో ఉన్నప్పుడు నొప్పించక ఉండే ప్రయత్నం చేయుట ఉత్తమం. వ్యాపారపరమైన విషయల్లో నూతన భాగస్వామిక ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది ఈ విషయంలో ఒక సారి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబంలో సభ్యుల ఆరోగ్యం మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం.    

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచన విధానం అలాగే మాటతీరు తోటివారిని ఇబ్బందికి గురిచేసిదిగా ఉండే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన విషయల్లో మాత్రం తెలివిగా వ్యవహరించుట వలన ఇబ్బందుల నుండి తప్పించుకొగలుగుతారు. అధికారుల నుండి నూతన విషయలను తెలుస్కోనే అవకాశం ఉంది. అనవసరమైన ఆలోచనలకు సమయం ఇవ్వడం వలన నూతన ఇబ్బందులను పొందే ఆస్కారం కలదు కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పెద్దలతో చర్చల్లో పాల్గొనే సమయంలో వారికి అనుగుణంగా వ్యవహరించుట మంచిది.    

 

 

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద ప్రయాణాల వలన ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది వాయిదా వేయుట మంచిది. ఆర్థికపరమైన విషయల్లో ఊహించని ఖర్చులను మీ ఆనుకున వారినుండి పొందుటకు అవకశం ఉంది. తలపెట్టిన పనులను నలుగురి సహకారం తీసుకోవడం వలన పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో సభ్యుల నుండి ఆశించిన విధంగా సహకారం రావడం అనేది ఊరట. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున తగినజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. స్త్రీ సంభందమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. 

మరిన్ని శీర్షికలు
coffe shop love stories short flim ( episode -1)