Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul act with super star

ఈ సంచికలో >> సినిమా >>

దగ్గుబాటి హీరోల డబుల్‌ ధమాకా

daggubati heros double dhamaka

వెంకటేష్‌, రానా ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. 'క్షణం' సినిమాతో పాపులర్‌ అయిన డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు. ఈయన డైరెక్షన్‌లో రానా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో వేంకటేష్‌ కూడా కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. రానా ప్రస్తుతం 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడట. గతంలో రానా హీరోగా వచ్చిన 'కృష్ణం వందే జగద్గురుమ్‌' సినిమాలో వెంకీ ఒక పాటలో రానాతో కలిసి రెండు స్టెప్పులేశాడు. కానీ ఈ సినిమాలో ఎక్కువ నిడివి గల పాత్రలో కనిపించనున్నాడట. పూర్తి మల్టీ స్టారర్‌ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట. ఈ సినిమాలో రానా పక్కన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది. మరో పక్క రానా బాలీవుడ్‌లో 'ఘాజీ' సినిమాలో నటిస్తున్నాడు.. ఈ రకంగా కేవలం టాలీవుడ్‌కే పరిమితం అయిపోకుండా, బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతున్నాడు. మరో పక్క వెంకటేష్‌ విషయానికొస్తే నిన్న మొన్నటిదాకా పెద్ద తరహా పాత్రల్లో నటించి, హిట్స్‌ మీద హిట్స్‌ కొట్టాడు వెంకటేష్‌. వరుసగా పిల్లల తండ్రిగా కనిపించాడు 'దృశ్యం', గోపాల గోపాల' సినిమాల్లో వెంకీ. ఇప్పుడు ట్రాక్‌ మార్చి లవర్‌బోయ్‌లా కనిపిస్తున్నాడు 'బాబు బంగారం' సినిమాలో. స్వీట్‌ సిక్స్‌టీన్స్‌లా కనిపిస్తోంది ఈ సినిమాలో వెంకీ, నయన్‌ల జంట. మొత్తానికి ఈ బాబాయ్‌, అబ్బాయ్‌లు తమలో తామే నటనలో వైవిధ్యానికి పడుతున్న పోటీకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే కదా!

మరిన్ని సినిమా కబుర్లు
kabali is comming