Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
daggubati heros double dhamaka

ఈ సంచికలో >> సినిమా >>

'కబాలి' వచ్చేస్తోందోచ్‌

kabali is comming

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'కబాలి' సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది 'కబాలి'. ఇప్పటికే ఈ సినిమా క్రియేట్‌ చేస్తోన్న సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. కేవలం సౌత్‌లోనే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీకి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా వెనుకాడడంం లేదు. ఏ దేశానికి ఆ దేశమే పబ్లిసిటీ విషయంలో తమదైన శైలిలో ప్రచారం చేస్తోంది. అమెరికాలో అయితే ఒక ధియేటర్లో ఫ్రీగా అందరికీ సినిమా చూపించనున్నారట. మరో చోట విడుదలకు ముందే టిక్కెట్లన్నీ అమ్ముడయిపోయాయి. ఇక చైనాలో అయితే రజనీ కాంత్‌ మైనపు బొమ్మలు తయారు చేసి ప్రపంచం మొత్తం సరఫరా చేస్తున్నారట. ఇండియాలో ఎయిర్‌ ఏషియా అత్యంత చిత్రంగా రజనీ కాంత్‌ స్టైల్స్‌తో ఏకంగా విమానాన్నే రన్‌ చేసేస్తోంది. ఇలా ఇంత హైప్‌ క్రియేట్‌ అవుతోంది ఈ సినిమాపై. రాధికా ఆప్టే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రజనీ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. కలైపులి ఎస్‌.థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికెట్‌ అందుకుంది. పండగలా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాను మలాయ్‌, చైనా భాషల్లోకి కూడా అనువదించడం జరిగింది. 

మరిన్ని సినిమా కబుర్లు
ganta srinivasarao  son as hero