Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kabali is comming

ఈ సంచికలో >> సినిమా >>

హీరోగా మంత్రిగారబ్బాయ్‌

ganta srinivasarao  son as hero

టిడిపి నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కుమారుడ్ని తెరపై హీరోగా చూసుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాన్జీ, గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ హీరోగా సినిమాని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. తొలి షాట్‌కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, తొలి క్లాప్‌ కొట్టారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్‌ చేశారు. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాకి సంబంధించి మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. శారదా ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ కిషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కాళహస్తి' పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు జయంత్‌ సి పరాన్జీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. హర్షవర్ధన్‌ ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందిస్తున్నారు. బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట. అంతే కాదు భారీ కాస్టింగ్‌కి కూడా ఈ సినిమాలో ఛాన్స్‌ ఉందని సమాచారం. ఒక ప్రముఖ హీరోయిన్‌ ఈ సినిమాలో నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హంగు, ఆర్భాటాల విషయంలో ఈ సినిమా చాలా రిచ్‌గా రూపొందనుందట. 

మరిన్ని సినిమా కబుర్లు
young hero in negetive role