Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ganta srinivasarao  son as hero

ఈ సంచికలో >> సినిమా >>

నెగెటివ్‌ రోల్‌లో యంగ్‌ హీరో

young hero in negetive role

యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర 'అందాల రాక్షసి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈ యంగ్‌ హీరో ఖాతాలో సరైన హిట్‌ లేదు. వెండి తెరపై వెలిగిపోవాలంటే హీరోగానే కాదు, విలన్‌గానూ ప్రయత్నించొచ్చనుకున్నాడో ఏమో, ఈ యంగ్‌ హీరో నెగెటివ్‌ రోల్‌పై దృష్టిపెట్టాడు. నాని హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో విలన్‌గా ఛాన్స్‌ దక్కించుకున్నాడట నవీన్‌ చంద్ర. యంగ్‌ హీరోల్లో గోపీచంద్‌, విలన్‌గా నటించిన తర్వాతే హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతెందుకు చిరంజీవి కూడా కెరీర్‌ తొలి నాళ్ళలో నెగెటివ్‌ రోల్స్‌ చేశారు. శ్రీకాంత్‌, రాజశేఖర్‌, మోహన్‌బాబు కూడా అంతే. అయితే వారంతా మొదట నెగిటివ్‌ లుక్‌లో వచ్చి, తర్వాత హీరోలయ్యారు. నవీన్‌ అయితే హీరోగా వచ్చి విలన్‌గా సెటిలవుదామనుకుంటున్నాడు. ఎలాగూ ఈ హీరోకి నెగిటివ్‌ లుక్స్‌ బాగా సెట్టవుతాయి కూడా. అందుకే అలాంటి హీరోలందరి బాటలో నెగెటివ్‌ రోల్‌ వైపు ఫోకస్‌ పెట్టిన నవీన్‌ చంద్ర తొలి సినిమాతోనే విలన్‌గా సక్సెస్‌ కొడ్తాడని ఆశిద్దాం. వరుస విజయాలతో దూకుడు మీదున్న నానికి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. సో ఆ అంచనా ప్రకారం నవీన్‌కి ఈ సినిమా సక్సెస్‌ తెచ్చిపెట్టేలానే ఉంది. ఆల్‌ ది బెస్ట్‌ టు నవీన్‌ చంద్ర. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam